Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-14 10:38:29
TWM News:-ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా ఉంటే చాలు కోట్ల సంపాదన ఉన్నట్లే అని పెద్దలు చెబుతారు. అయితే ప్రపంచంలో 50 శాతానికి పైగా ప్రజలు రకరకాల వ్యాధితో బాధపడుతున్నారట. ముఖ్యంగా పోషకాహార లోపంలో బాధపడుతున్నారని.. ఇది కాలక్రమంలో తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా తలెత్తవచ్చు అని హెచ్చరిస్తున్నారు.
ప్రపంచలోని జనాభాలో సగం మందికి పైగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. చాలా మంది కాల్షియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి అవసరమైన పోషకాలు తగినంతగా లభించడం లేదని ఓ పరిశోధన వెల్లడించింది. హార్వర్డ్ TH చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చర్స్, UC శాంటా బార్బరా, గ్లోబల్ అలయన్స్ ఫర్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ లు సంయుక్తంగా చేపట్టిన పరిశోధనలో ఈ సమాచారం వెల్లడింది.
శరీరంలో సాధారణ సూక్ష్మపోషకాల లోపం పోషకాహార లోపంలో ఒక రూపం. ఇది తరువాత తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా తలెత్తవచ్చు. ఇది గర్భధారణ సమయంలో అంధత్వం వంటి అనేక సమస్యలకు కూడా దారి తీస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా 185 దేశాలకు చెందిన 17 వయస్సు గల వ్యక్తులపై ఈ అధ్యయనం నిర్వహించారు. వాటిలో కాల్షియం, అయోడిన్, ఐరన్ , విటమిన్లు వంటి పోషకాల ఉనికిని వారు విశ్లేషించారు.
ప్రపంచ జనాభాలో 68 శాతం మందికి అయోడిన్ లోపం ఎక్కువగా ఉందని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. 67% మందికి విటమిన్ ఇ, 66% మందికి కాల్షియం, 65% మందికి ఐరన్ లోపం ఉంది. ప్రపంచ జనాభాలో సగానికి పైగా రిబోఫ్లేవిన్, ఫోలేట్, విటమిన్లు సి , బి6 లోపం ఉన్నట్లు తెలుస్తోంది.
మహిళల్లో అయోడిన్, ఐరన్, విటమిన్ బి12 లోపం ఎక్కువగా ఉందని పరిశోధనల ద్వారా వెల్లడైంది. పురుషుల్లో కాల్షియం, విటమిన్ ఎ, జింక్ వంటి పోషకాలు తక్కువగా ఉన్నాయి. వైద్యుల చెప్పిన ప్రకారం విటమిన్ల లోపం వల్ల ఎముకలు బలహీనపడటం, రక్తహీనత, చర్మ రుగ్మతలు, బలహీనమైన రోగనిరోధక శక్తి, మానసిక ఆందోళన, నిరాశ వంటి వివిధ వ్యాధులకు కారణం కావచ్చని పేర్కొన్నారు.