Responsive Header with Date and Time

మూడు పూటల అన్నమే తింటున్నారా..? అయితే, మీకోసం హాస్పిటల్లో బెడ్ రెడీ ఉన్నట్లే..

Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-14 10:34:11


మూడు పూటల అన్నమే తింటున్నారా..? అయితే, మీకోసం హాస్పిటల్లో బెడ్ రెడీ ఉన్నట్లే..

TWM News:-ప్రతిరోజూ అన్నం తినడం మంచిదే అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..కొంతమంది రోజుకు మూడు పూటలా అన్నమే తింటారు. నిజానికి అన్నం ఎక్కువగా తినడం మంచిది కాదు. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు అన్నం తినకుండా ఉండాలి. లేదంటే రకరకాల అనారోగ్య సమస్యల భారం పడే అవకాశం ఉంది. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, ఎక్కువగా అన్నం తినడం వల్ల కొంతమందిలో వివిధ దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి.. అయితే అన్నం ఎక్కువగా తినడం వల్ల వచ్చే వ్యాధులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ఊబకాయం: చాలామంది అన్నం ఎక్కువగా తింటారు. నిజానికి ఇలా తినడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అన్నం ఎక్కువగా తింటే శరీరంలో కార్బోహైడ్రేట్స్ విపరీతంగా పెరుగుతాయి. అలాగే శరీర బరువు పెరిగే కొద్దీ కొవ్వు శాతం రెట్టింపు అవుతుంది. ఇది ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది.

మధుమేహం: అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.. కాబట్టి దీన్ని రోజుకు మూడుసార్లు తినడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అలాగే ఇప్పటికే మధుమేహంతో బాధపడే వారికి రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

జీర్ణ సమస్యలు: అన్నం ఎక్కువగా తినడం వల్ల వివిధ రకాల జీర్ణ సమస్యలు వస్తాయని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. అన్నం ఎక్కువగా తినడం వల్ల అజీర్ణం, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఇప్పటికే అనేక రకాల పొట్ట సమస్యలతో బాధపడేవారు అన్నం ఎక్కువగా తినకుండా ఉండాలి.

గుండె సంబంధిత వ్యాధులు: అన్నం ఎక్కువగా తింటే గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే శరీరంలో అకస్మాత్తుగా షుగర్ లెవెల్, కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.

కాలేయ వ్యాధులు: కొందరిలో అన్నం ఎక్కువగా తినడం వల్ల ఉత్పత్తి అయ్యే కొన్ని రసాయనాలు కాలేయంపై కూడా ప్రభావం చూపుతాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కాలేయం దెబ్బతినడంతోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

శరీరం బలహీనత: ఎక్కువ మొత్తంలో అన్నం తినడం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్లు మాత్రమే లభిస్తాయి. దీనివల్ల శరీరానికి ప్రయోజనం ఉండదు. అలాగే పోషకాలు తగినంత పరిమాణంలో లభించవు. దీని వల్ల శరీర బలహీనత వంటి సమస్యలు, చిన్న చిన్న పనులకే తరచుగా శరీరం శక్తిని కోల్పోతుంది.


Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: