Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2025-05-07 11:30:23
తెలుగు వెబ్ మీడియా న్యూస్: సీమాంతర ఉగ్రవాదం అంతమయ్యే వరకు దాయాది పాకిస్థాన్‌తో భారత్ క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని చీఫ్ కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. ఆసియాకప్, ఐసీసీ టోర్నీల్లోనూ పాక్‌తో మ్యాచ్‌లు ఆడవద్దని సూచించాడు. ఒక జాతీయ టెలివిజన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గంభీర్ పలు అంశాలపై మాట్లాడాడు. పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడవద్దనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఉగ్రవాదం అంతమయ్యే వరకు భారత్, పాక్ మధ్య ఎలాంటి మ్యాచ్‌లు జరుగవద్దు. ఈ విషయంలో మేము ఆడాలా వద్దా అనేది కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. భారత సైనికులు, పౌరుల ప్రాణాల కంటే క్రికెట్, సినిమాలు పెద్ద ప్రాధాన్యత కాదు. మ్యాచ్‌లు జరుగుతూనే ఉంటాయి, సినిమాలు తీస్తూనే ఉంటారు, సింగర్లు పాటలు పాడుతూనే ఉంటారు. కానీ మన కుటుంబం కోల్పోయిన ఆప్తుల ప్రాణాల కంటే గొప్ప కాదు కాదా అని అన్నాడు. ఇదిలా ఉంటే రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌లో ఉన్నంత కాలం జట్టుకు ఆడుతారని గంభీర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసే జట్టులో తన ప్రమేయం లేదని తెలిపాడు.