Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-05-07 10:53:26
తెలుగు వెబ్ మీడియా న్యూస్:ఉద్యోగ సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలు రాష్ట్ర భవిష్యత్‌కు శాపంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ని, మమ్మల్ని ఎన్ని తిట్టినా భరించాం, భరిస్తాం అన్నారు. తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బతినేలా సీఎం మాట్లాడితే సహించేది లేదు. రేవంత్ రెడ్డి అత్యంత అసమర్థ, దక్షతలేని సీఎం అని నిన్నటి వ్యాఖ్యలతో తేలిపోయింది. ఢల్లీి పార్టీలను నమ్మొద్దని ప్రజలకు కేసీఆర్ చిలుకకు చెప్పినట్లు చెప్పారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ చెప్పిన మాటాలు నేడు అక్షరసత్యాలయ్యాయి. పరిపాలన చేతగాదని, సీఎం రేవంత్ రెడ్డి కాడి కిందపడేశారు అని విమర్శించారు.