Category : | Sub Category : ఇతర వార్తలు Posted on 2024-07-29 11:59:24
TWM News:-అయితే కలలో వచ్చే కొన్ని అంశాలు మనకు మంచిని సూచిస్తే. మరికొన్ని మాత్రం చెడుకు సంకేతంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కలలో కొన్ని రకాల అంశాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదని అంటున్నారు. వీటివల్ల చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇంతకీ కలలో ఎలాంటివి కనిపిస్తే చెడుకు సంకేతాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతీ ఒక్కరికీ కలలు రావడం సర్వసాధారణమైన విషయం. రాత్రి మనం పడుకున్న తర్వాత, మన ప్రమేయం లేకుండా వచ్చే కలలు మన వాస్తవిక జీవితంపై ప్రభావం చూపుతాయని పండితులు చెబుతున్నారు. కేవలం శాస్త్రం మాత్రమే కాకుండా సైన్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతుంది. స్వప్నశాస్త్రంలో ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.
అయితే కలలో వచ్చే కొన్ని అంశాలు మనకు మంచిని సూచిస్తే. మరికొన్ని మాత్రం చెడుకు సంకేతంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కలలో కొన్ని రకాల అంశాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదని అంటున్నారు. వీటివల్ల చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇంతకీ కలలో ఎలాంటివి కనిపిస్తే చెడుకు సంకేతాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* కలలో పంది, కోతి, పిల్లి వంటివి కనిపిస్తే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇవి భవిష్యత్తులో ప్రమాదానికి సంకేతంగా భావించాలని సూచిస్తున్నారు.
* సాధారణంగా నవ్వుతూ, ఆనందంగా మంచికి సంకేతంగా భావిస్తాం. అయితే కలలో ఆనందంగా ఉండడం లేదా వివాహానికి హాజరైనట్లు కనపిస్తే మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది మీకేదో ప్రమాదం జరగబోతోందని చెప్పేందుకు సంకేతంగా భావించాలి.
* కలలో ఎవరో తిరుగుతున్నట్లు కనిపిస్తే అది చెడుకు సంకేతంగా భావించాలి. ఇలా కనిపిస్తే మీకు త్వరలోనే సంపద నష్టం జరిగే అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవాలి.
* ఎవరైన బ్రాహ్మణ వ్యక్తి కోపంతో ఊగిపోతున్నట్లు కలలో కనిపిస్తే మీరు ప్రమాదపు అంచున ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఇది మీకు చెడును సూచిస్తుందని అర్థం చేసుకోవాలి.