Category : నేర | Sub Category : తెలంగాణ Posted on 2024-11-20 10:53:28
TWM News:-వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్న ఎ2 భోగమోని సురేశ్జ్ మంగళవారం కొడంగల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు.
వికారాబాద్, కొడంగల్, దుద్యాల-న్యూస్టుడే: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్న ఎ2 భోగమోని సురేశ్జ్ మంగళవారం కొడంగల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు నీరేటి సురేశ్(38), నీరేటి చిన్న హన్మంతు (ఎ55)లను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రథమశ్రేణి న్యాయమూర్తి శ్రీరామ్ వీరికి 14 రోజుల రిమాండ్ విధించగా, సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. కాగా జైలునుంచి వచ్చిన తరువాత రైతుల పక్షాన పోరాడతానని పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు సురేశ్ రాజ్ స్థానిక విలేకరులతో అన్నాడు. ఇతను ఎక్కడి నుంచి వచ్చి లొంగిపోయాడనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. ఈనెల 11న దుద్యాల గ్రామసభలో జిల్లా కలెక్టర్ బృందం నిరీక్షిస్తుండగా, ఆ సమయంలో అక్కడికి వెళ్లిన సురేశ్రాజ్ లగచర్లలో ప్రజలు అధికారుల కోసం నిరీక్షిస్తున్నారని నమ్మబలకడంతో ఆ గ్రామానికి అధికారుల బృందం వెళ్లింది. వెంటనే పలువురు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో భారాస మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిపై ప్రధాన నిందితునిగా అభియోగం మోపి అరెస్టు చేశారు. కాగా సురేశ్ రాజ్ ప్రజలను రెచ్చగొట్టారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతను లొంగిపోవడంతో కేసు విచారణ వేగవంతం చేశారు.