Responsive Header with Date and Time

రాజు వెడ్స్ రాంబాయి టైటిల్ గ్లింప్స్ లాంచ్

Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2024-11-20 11:21:20


రాజు వెడ్స్ రాంబాయి టైటిల్ గ్లింప్స్ లాంచ్

నీది నాది ఒకే కథ, విరాట పర్వం వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు వేణు ఉడుగుల నిర్మాతగా మారి తన తొలి నిర్మాణ సంస్థను అనౌన్స్ చేశారు, రాహుల్ మోపిదేవితో కలిసి డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్స్ టేల్స్ బ్యానర్‌పై సినిమాని నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.ఈ చిత్రానికి మేకర్స్ రాజు వెడ్స్ రాంబాయి అనే ఆసక్తికరమైన టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఖమ్మం, వరంగల్ బోర్డర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా యదార్థ కథ ఆధారంగా తెరకెక్కింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడిన మూవీస్ ఎల్లప్పుడూ ప్రేక్షకులలో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తాయి. రాజు వెడ్స్ రాంబాయి శాశ్వతమైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది.టైటిల్ పోస్టర్‌లో హీరో డ్రమ్ వాయిస్తూ వుండగా అతని పక్కన తన ప్రేమికురాలిని ప్రజెంట్ చేస్తోంది. టైటిల్ గ్లింప్స్ అమ్మాయి ఈ డ్రమ్మర్‌తో ప్రేమలో పడిన యెనగంటి రాంబాయిగా తనను తాను పరిచయం చేసింది. అతను డ్రమ్స్ వాయించే విధానాన్ని ఆమె ఇష్టపడుతుంది. యెల్లందులోని బొగ్గు గనుల వంటి గ్రామంలో తన ప్రేమకథ పాపులర్ అని ఆమె చెబుతుంది. ఆమె తమ ప్రేమకథను తీన్‌మార్, దో మార్,  నాగిని చెప్పడం ఆసక్తికరంగా వుంది.

టైటిల్, గ్లింప్స్ ప్రకారం రాజు వెడ్స్ రాంబాయి తెలంగాణ నేపథ్యంలో సాగే అందమైన గ్రామీణ ప్రేమకథ. వేణు ఊడుగుల సపోర్ట్ తో ఈ ప్రాజెక్ట్ మరపురాని అనుభూతిని అందించబోతోంది.ఈ చిత్రానికి వాజిద్ బేగ్ డీవోపీ కాగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి నరేష్ అడుప ఎడిటర్ కాగా, సాహిత్యం మిట్టపల్లి సురేందర్ అందించారు. గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైనర్.రాజు వెడ్స్ రాంబాయిని ప్రేమికుల రోజున ఫిబ్రవరి 14, 2025న విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన తారాగణం, ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.టైటిల్ గ్లింప్స్ లాంచ్ ప్రెస్ మీట్ లో నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ.. సాయిలు నాతో మూడేళ్లుగా ట్రావెల్ చేస్తున్నాడు. ఒకరోజు వాళ్ళ ప్రాంతంలో జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని ఒక కథ రాశానని చెప్పాడు. ఆ కథ విన్న తర్వాత నాకు ఒక ఎక్స్ట్రార్డినరీ ఫీలింగ్ కలిగింది. ఎక్సైట్మెంట్ వచ్చింది. కథలో ఉన్న ఎన్నో సెన్స్, కథ జరిగే ప్రాంతం, పాత్రలు, ఆ పాత్రల మధ్య సంఘర్షణ అన్ని నన్ను బాగా ఎట్రాక్ట్ చేశాయి.  క్లైమాక్స్ మూడు రోజులపాటు నిద్రపోనివ్వలేదు. ఇంత వైవిధ్యమైనటువంటి ప్రేమ కథని నేనెప్పుడూ చూడలేదు వినలేదు. ఈ కథని సినిమాగా తీయాలని స్ట్రాంగ్ ఇంటెన్షన్ తో ఈటీవీ విన్ వాళ్లతో షేర్ చేయడం జరిగింది. వాళ్లు కూడా కథ విని హ్యాపీగా ఫీలయ్యారు. ఈ కొలాబరేషన్ తో మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశాం. ఇది మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా వుంది అన్నారు.


Search
Categories
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: