Category : | Sub Category : క్రీడా Posted on 2024-07-29 11:21:24
పారిస్ ఒలింపిక్స్ లో షూటింగ్ లో ఆదివారం మధ్యాహ్నం మను బాకర్ పతకం గెలవడంతో సాయంత్రం జరిగిన మహిళల ఆర్చరీ టీమ్ ఈవెంట్ పై అంచనాలు పెరిగాయి.
పారిస్: పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ లో ఆదివారం మధ్యాహ్నం మను బాకర్ పతకం గెలవడంతో సాయంత్రం జరిగిన మహిళల ఆర్చరీ టీమ్ ఈవెంట్ పై అంచనాలు పెరిగాయి. మనూ స్ఫూర్తితో భారత అమ్మాయిలు సత్తా చాటుతారని భావించారు. కానీ ఆశలన్నీ కూలుస్తూ భారత బృందం తీవ్రంగా నిరాశ పరిచింది. పేలవ ప్రదర్శనతో క్వార్టర్స్ లోనె ఇంటిముఖం పట్టింది. 51-52, 49-54, 48-53తో నెదర్లాండ్స్ చేతిలో చిత్తయింది. ఆరంభం నుంచీ దీపిక బృందానికి వెనుకంజే! తొలి సెట్లో వెనుకబడితే.. రెండో సెట్లోనైనా పుంజుకుంటారనుకుంటే అదీ జరగలేదు. మూడో సెట్అ యితే ఇంకా దారుణం! ఎంతో అనుభవం ఉన్న దీపిక కుమారితో పాటు అంకిత భకత్ తేలిపోవడం భారత్ ను దెబ్బ తీసింది. లోపలి సర్కిల్లో బాణాలు సంధించడంలో దీపిక పూర్తిగా విఫలమైంది. కనీసం 9 పాయింట్లు కూడా సాధించకపోవడంతో నెదర్లాండ్స్కు భారత్ గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. 18 ఏళ్ల భజన్ కౌర్ సత్తా చాటినా ప్రయోజనం లేకపోయింది. తొలి సెట్లో కాస్త మెరుగ్గా రాణించిన భారత ఆర్చర్లు.. తర్వాతి రెండు సెట్లలో నెదర్లాండ్స్ ఆర్చర్ల ముందు తేలిపోయారు. ఇక టీమ్ విభాగంలో భారత్ ఆశలన్నీ పురుషుల టీమ్, మిక్స్డ్డ్ జట్లపైనేఉన్నాయి.