Responsive Header with Date and Time

ప్రజాబలంతో విజయం సాధిస్తా.. కమలా హారిస్ స్పష్టీకరణ...

Category : | Sub Category : బ్రేకింగ్ వార్తలు Posted on 2024-07-29 09:28:40


ప్రజాబలంతో విజయం సాధిస్తా.. కమలా హారిస్ స్పష్టీకరణ...

TWM NEWS: వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తాను వెనుకబడినా ప్రజాబలంతో భారీ విజయం సాధిస్తానని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు భవిష్యత్తు నిర్మాణం, దేశ తిరోగమనం అనే రెండు లక్ష్యాల మధ్య జరుగుతున్నట్లుగా అభివర్ణించారు. డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా తన ఎంపిక లాంఛనమైన నేపథ్యంలో ఆమె శనివారం తొలి విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అధ్యక్ష రేసు నుంచి బైడెన్ నిష్క్రమించిన తర్వాత హారిస్ బరిలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ తో పోలిస్తే ఆమె ప్రచారంలో కొంత వెనుకబడ్డారు. ఎన్నికలకు సుమారు 4 నెలలే ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ తన విధానాలను వెల్లడిస్తూ ఓటర్లను ఆమె ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది.

విరాళాల్లో జోరు..

డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విరాళాల సేకరణలో దూసుకెళ్తున్నారు. బైడెన్ వైదొలగిన అనంతరం బరిలోకి వచ్చిన ఆమె.. వారంలోపే దాదాపు 20 కోట్ల డాలర్లను సేకరించడం విశేషం.

అతివాద హారిస్ హింస తప్పదు: ట్రంప్

అతివాద కమలా హారిస్ దేశంలో నేరాలు, ఘర్షణలు, మారణ హోమం, చావులు తప్పవని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆమె బైడెన్ కంటే చెత్త అభ్యర్థి అని వ్యాఖ్యానించారు. ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్తో కలిసి శనివారం మిన్నెసోటాలో జరిగిన ప్రచార సభలో ట్రంప్ మాట్లాడారు. అధికారంలోకి రాగానే ఓపెన్ బోర్డర్ పాలసీని రద్దు చేస్తానని స్పష్టం చేశారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి జో బైడెన న్ను బలవంతంగా తొలగించారని ఆరోపించారు.

Search
Categories
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: