Category : | Sub Category : బ్రేకింగ్ వార్తలు Posted on 2024-07-29 08:57:20
TWM NEWS:భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో ఆదివారం భేటీ అయ్యారు. క్వాడ్ సమావేశాల కోసం జపాన్ రాజధాని టోక్యోకు వచ్చిన వారిరువురూ విస్తృత స్థాయి చర్చలు జరిపారు.
టోక్యో: భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో ఆదివారం భేటీ అయ్యారు. క్వాడ్ సమావేశాల కోసం జపాన్ రాజధాని టోక్యోకు వచ్చిన వారిరువురూ విస్తృత స్థాయి చర్చలు జరిపారు. మూడు వారాల క్రితం వాషింగ్టన్లో నాటో సమావేశం జరుగుతున్న సమయంలోనే భారత ప్రధాని మోదీ రష్యాలో పర్యటించడంపై అమెరికా అసంతృప్తితో ఉన్న తరుణంలో.. ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు సిక్కు అతివాది గురుపత్వంత్ పన్నూను న్యూయార్క్ అంతమొందించేందుకు భారత ఏజెంట్లు కుట్ర పన్నినట్లు ఆరోపిస్తున్న అమెరికా.. అందుకు భారత ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు సమావేశం కావడం చర్చనీయాంశమైంది. అయితే వారి చర్చల్లో మోదీ రష్యా పర్యటన, పన్నూ హత్యకు కుట్ర అంశాలు ప్రస్తావనకు వచ్చాయా అన్నది తెలియరాలేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గాజాలో పరిస్థితిపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. మా ద్వైపాక్షిక ఎజెండా స్థిరంగా పురోగమిస్తోంది. దీంతోపాటు ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై విస్తృత చర్చలు జరిపాం అని జైశంకర్ ఎక్స్ పేర్కొన్నారు.