Category : | Sub Category : క్రీడా Posted on 2024-07-27 12:23:38
TWM News :-జూలై 27వ తేదీన భారత జట్టు ఒలింపిక్ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఎక్కువ మంది క్వాలిఫికేషన్ రౌండ్ లేదా స్టేజ్ రౌండ్‌లో పాల్గొననున్నారు. అదే సమయంలో షూటింగ్ ఈవెంట్‌లో భారత్ పతకం కోసం ఆడనుంది. భారత అథ్లెట్లు జూలై 27వ తేదీ శనివారం రోజున మొత్తం 7 క్రీడల్లో పాల్గొననున్నారు. మొదటి ఈవెంట్ బ్యాడ్మింటన్ ఉంటుంది. షూటింగ్‌లో పతకం కోసం పోటీపడనున్నది భారత్ పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్‌తో భారత బృందం జర్నీ ప్రారంభమైంది. జూలై 25న పురుషుల ఆర్చరీ జట్టు నుంచి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ పాల్గొన్నారు. మహిళల జట్టుకు చెందిన దీపికా కుమారి, అంకితా భకత్, భజన్ కౌర్ తమ ప్రతిభను చూపించారు. ఈ ఈవెంట్‌లో రెండు జట్లూ టాప్-4లో నిలిచి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. అయితే ఆర్చరీ వ్యక్తిగత ఈవెంట్‌లో ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. అయితే ఒలింపిక్స్ లో అసలు ఆట రేపటి నుంచి (జూలై 27) ప్రారంభం కానుంది. జూలై 27వ తేదీన భారత జట్టు ఒలింపిక్ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఎక్కువ మంది క్వాలిఫికేషన్ రౌండ్ లేదా స్టేజ్ రౌండ్‌లో పాల్గొననున్నారు. అదే సమయంలో షూటింగ్ ఈవెంట్‌లో భారత్ పతకం కోసం ఆడనుంది.
ఏ ఆటలో ఏ ఆటగాళ్ళు పాల్గొంటారంటే..
భారత అథ్లెట్లు జూలై 27వ తేదీ శనివారం రోజున మొత్తం 7 క్రీడల్లో పాల్గొననున్నారు. మొదటి ఈవెంట్ బ్యాడ్మింటన్ ఉంటుంది. ఈ గేమ్‌లో పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, తానీసా క్రెస్టో జోడీ బరిలోకి దిగనుంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో ఎస్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్‌లు పోటీపడనున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో పోటీపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ గ్రూప్ దశలో ఉంటాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి జియో సినిమా, స్పోర్ట్స్ 18లో భారత అథ్లెట్లు పోటీలను చూడవచ్చు.
షూటింగ్‌లో పతకం కోసం పోటీపడనున్న భారత్
బ్యాడ్మింటన్ తర్వాత రోయింగ్, షూటింగ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. రోవింగ్ పురుషుల సింగిల్స్ స్కల్స్ హిట్స్ రౌండ్‌లో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి బలరాజ్ పన్వార్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సమయంలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ రౌండ్ జరగనుంది. ఇందులో సందీప్ సింగ్, అర్జున్ బాబౌటా, రమితా జిందాల్, ఎలవెనిల్ వలరివన్ పాల్గొంటారు. ఈ క్రీడా పోటీ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభంకానుంది. దీనిలో ఈ జట్టు అర్హత సాధిస్తే మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగే నెక్స్ట్ రౌండ్ కు చేరుకుంటారు. ఒకవేళ ఈ రౌండ్ లో అడుగు పెడితే ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ భారత్ కు తొలి పతకాన్ని అందించే అవకాశం ఉంది.