Responsive Header with Date and Time

సెక్యూరిటీ గార్డు‌గా పిల్లికి ఉద్యోగం.. జీతం ఎంతో తెలిస్తే షాకే..!

Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-07-27 11:48:31


సెక్యూరిటీ గార్డు‌గా పిల్లికి ఉద్యోగం.. జీతం ఎంతో తెలిస్తే షాకే..!

TWM News :-ఆర్టీసి కార్గో పార్శిల్ సర్వీస్‌కు సెక్యూరిటీ గార్డ్‌గా ఒక పిల్లిని ఉంచారు అధికారులు. సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేస్తున్న పిల్లికి జీతం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ఎక్కడ ఎందుకు చూడండి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న కార్గో పార్సెల్ సర్వీస్ వద్ద ఒక పిల్లి కూన సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేస్తోంది.అదేంటి పిల్లి సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేయటం ఏంటి అని అనుకుంటున్నారా అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే..!

అసలు కథ ఏంటంటే..? గత కొన్ని నెలలుగా ఖమ్మం జిల్లాలోని కార్గో పార్సిల్ సర్వీస్ కార్యాలయంలో ఎలుకలు పార్సిల్లను డ్యామేజ్ చేస్తున్నాయి. దీంతో కస్టమర్లు కార్గో సర్వీస్ ఇంచార్జ్ తో గొడవ పడటం తరచుగా జరుగుతోంది. నిత్యం కార్గో సర్వీస్ కొచ్చే పార్సిల్లను బస్సులలో లోడింగ్ చేసే హమాలీలు కూడా దీర్ఘాలోచనలో పడ్డారు. వారికి అనుకోకుండా ఒక పిల్లి కూన కనబడింది. ఆ పిల్లికూన ను ఆర్టీసీ కార్గో పార్సిల్ సర్వీస్ కార్యాలయంలోనే ఉంచుతూ సాకుతున్నారు.


హమాలీలు కార్గో సర్వీస్ ఇంచార్జ్ ఆ పిల్లి పట్ల అత్యంత ప్రేమను చూపడంతో ఆ పిల్లి కూడా అక్కడే ఉంటూ రాత్రింబవళ్లు కాపాలా కాస్తోంది. ప్రతిక్షణం అలర్ట్‌గా ఉంటూ ఎలుకలు పార్సిల్‌లను డామేజ్ చేయకుండా భద్రతగా కాపాలా కాస్తూ ఉంటుంది. అందుకోసం ఆ పిల్లి హమాలీల నుంచి కార్గో సర్వీస్ ఇంచార్జి నుంచి తను జీతం కూడా తీసుకుంటోంది. అదేంటంటే, ఉదయం ఒక పది రూపాయల పాల ప్యాకెట్ సాయంత్రం ఒక పది రూపాయల పాల ప్యాకెట్ ఆశిస్తుంది.

హమాలీలు పోసిన పాలు తాగే ఆ కార్యాలయంలో దర్జాగా అటు ఇటు తిరుగుతూ ఎక్సర్సైజ్ చేస్తూ ఎలుకలు రాకుండా కాపాడుతూ డ్యూటీ చేస్తోంది. ఈ పిల్లి కూన వచ్చిన దగ్గర నుంచి ఎలకల బెడద తప్పిందని హమాలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలుకలు బారి నుంచి తమ పార్సిళ్ళ బండిలను కాపాడుకోవాలంటే కేవలం మార్జాలం ఒకటే దిక్కని ఆలోచించారు. తమకు అనుకోకుండా ఒక పిల్లి కూన దొరకడంతో దాన్ని ఈ కార్గో సర్వీస్ లోనే పాలు పోస్తూ చిన్నపిల్లలను సాదినట్టుగా పెంచుకుంటున్నట్లు వారు వెల్లడించారు.


హమాలీలు పనిచేస్తుంటే వారి పైకెక్కుతూ దిగుతూ అటు ఇటు గెంతులు వేస్తూ ఎలుకల కోసం తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కాంటా కండక్టర్లు కార్గో సర్వీస్ కు వచ్చినప్పుడు వారితో సరదాగా ఆడుకుంటూ ఉంటుంది. దీంతో వాళ్లు కూడా వచ్చినప్పుడు పాల ప్యాకెట్ తీసుకువచ్చి పిల్లికూన కు పాలు పోసి మురిపెంగా చూసుకుంటూ కాసేపు సమయం గడిపి సంతోషంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు. ఇలా హమాలీల తో కార్గో సర్వీస్ సిబ్బందితో ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్ లతో ఆ పిల్లి సరదాగా గడుపుతూ కార్గో సర్వీస్ పార్సిల్లను 24 గంటలు ఎలుకల నుంచి కాపాడుతూ సెక్యూరిటీ గార్డు డ్యూటీ చేస్తూ తన నిజాయితీని చాటుకుంటోంది అంటూ ఆర్టీసీ ఉద్యోగులు కితాబు ఇస్తున్నారు.


Search
Categories
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: