Category : | Sub Category : క్రీడా Posted on 2024-07-27 09:54:05
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్ లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి.
టియాఫో: పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లోలో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఎగసే అలల కోసం వీళ్లు వేచి చూడాలి. పారిస్ లో టహిటి, ఫ్రెంచ్ పోలినేసియాల్లో సర్ఫింగ్ జరగబోతోంది. వాతావరణ శాస్త్రవేత్తలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎక్కడ అలలు వచ్చే అవకాశం ఉందో చూసుకుంటూ ఉంటారు సర్ఫింగ్ క్రీడాకారులు. తాజా సాంకేతిక పరిజ్ఞానంతో పదిరోజుల ముందు వరకు కూడా ఎక్కడ అలలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందో తెలుసుకోవచ్చు. ఎంత పరిమాణంలో అలలు ఎగసిపడతాయన్నది తెలుసుకునేందుకు కూడా సాంకేతిక పరిజ్ఞానం సాయం చేస్తుంది. ఎక్కువగా అలలు వచ్చే సమయంలో వెళ్లి పోటీల్లో పాల్గొనొచ్చు. అలా సిద్ధమైనా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటే వాళ్ల ఆటకు అంతరాయం తప్పదు. ఒలింపిక్స్లో జులై 27-ఆగస్టు 5 మధ్య సర్ఫింగ్ పోటీలు జరుగుతాయి. తొలిరోజే అలలు వచ్చే అవకాశం ఉందని అంచనా.