Responsive Header with Date and Time

బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్

Category : | Sub Category : క్రీడా Posted on 2024-07-27 09:41:51


బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్

మహిళల ఆసియా కప్ లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ను  చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది.

దంబుల్లా: మహిళల ఆసియా కప్ లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచినభారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ను  చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రేణుక  సింగ్ (3/10) విజృంభించడంతో శుక్రవారం భారత్ 10 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదటరేణుకకు తోడు రాధ యాదవ్ (3/14) కూడా విజృంభించంతో బంగ్లా 20 ఓవర్లలో 8 వికెట్లకు 80పరుగులే చేయగలిగింది. కెప్టెన్ నిగర్ సుల్తానా (32) టాప్ స్కోరర్. అనంతరం భారత్ 11ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మంధాన (55 నాటౌట్; 39 బంతుల్లో9x4, 1x6) చెలరేగగా.. షెఫాలీవర్మ (26 నాటౌట్) కూడా రాణించింది. ఆదివారం జరిగే ఫైనల్లోభారత్.. శ్రీలంకను ఢీకొంటుంది. మరో సెమీస్లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను  ఓడించింది. మొదట పాక్ 140/4 స్కోరు చేసింది. మునీబా అలీ (37) టాప్ స్కోరర్. ప్రభోదిని(2/23) రాణించింది. ఛేదనలో లంక తడబడినా.. 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్నిచేరుకుంది. చమరి ఆటపట్టు (63) విజయంలో కీలకపాత్ర పోషించింది. సాదియా (4/16) సత్తాచాటినా పాక్ ను  గెలిపించలేకపోయింది.

Search
Categories
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: