Responsive Header with Date and Time

భారత్ కు అండగా ఉందాం.. పాక్ కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్ లో బిల్లు

Category : | Sub Category : అంతర్జాతీయ Posted on 2024-07-26 10:21:00


భారత్ కు  అండగా ఉందాం.. పాక్ కు  సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్ లో  బిల్లు

TWM NEWS: భారత్ సైనిక సహకారాన్ని మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందంటూ అమెరికన్ కాంగ్రెస్లో కీలక సభ్యుడు మార్కో రుబియో గురువారం బిల్లు ప్రవేశపెట్టారు. అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా భారత్ను చూడాల్సిన అవసరం ఉందని బిల్లులో పేర్కొన్నారు.సాంకేతికత బదిలీ, ఆయుధాలు సహకారంలో భారత్కు అండగా ఉండాల్సిన అవసరం ఉందని బిల్లు ప్రతిపాదించింది. భారతదేశ ప్రాదేశిక సమగ్రతకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని గుర్తుచేసింది. దీన్ని ఎగదోస్తున్నట్లు తేలితే పాకిస్థాన్కు భద్రతా సాయాన్ని నిషేదించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

మరోవైపు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దురాక్రమణపూరిత వైఖరిని అనుసరిస్తోందని బిల్లు స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో అమెరికా మిత్రదేశాల సార్వభౌమత్వానికి చైనా సవాల్ విసురుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశాన్ని అడ్డుకోవాలంటే భారత్తో సత్సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.

అమెరికాలో నవంబరులో ఎన్నికలు జరగనున్నాయి. డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో బిల్లు గట్టెక్కడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. భారత్తో సంబంధాల విషయంలో ఇరు పార్టీలూ సానుకూలంగా ఉన్నాయని గుర్తుచేశారు. ఎన్నికల తర్వాత కొలువుదీరే కొత్త ప్రభుత్వంలో ఈ బిల్లు చట్టరూపం దాల్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని వివరించారు.

Search
Categories
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: