Category : | Sub Category : క్రీడా Posted on 2024-07-26 09:54:48
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్ కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
TWM NEWS: త్వరలో శ్రీలంక, భారత్ మధ్య మూడు టీ20, వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. ఈ టూర్ కోసం సెలక్షన్ కమిటీ ఇప్పటికే జట్లను ప్రకటించింది. టీ20 జట్టు శ్రీలంక చేరుకుని ప్రాక్టీస్లో నిమగ్నమైంది. భారత కోచ్గా గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ప్రస్థానం ఈ -పర్యటనతోనే మొదలవుతుంది. అయితే, భారత జట్టు ఎంపికలో కొంతమంది ఆటగాళ్ల ఎంపిక చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జింబాబ్వేతో టీ20 సిరీస్లో అరంగేట్రం చేసిన రియాన్ పరాగ్ను లంకతో రెండు సిరీస్కు ఎంపిక చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పరాగ్కు బదులు కొన్నాళ్లుగా నిలకడగా ఆడుతున్న తిలక్ వర్మ (Tilak Varma) ను కోచ్ గంభీర్ భారత జట్టులోకి తీసుకోవాలని భావించాడట. అయితే, ఐపీఎల్ 2024 సీజన్లో తిలక్ వర్మ చేతికి గాయమైంది. కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు.
తిలక్ వర్మ గాయం నుంచి కోలుకోలేదు. ఇది ఐపీఎల్ 2024 సీజన్లో రాణించిన రియాన్ పరాగ్కు కలిసొచ్చింది. తిలక్ అందుబాటులో లేకపోవడంతో పరాగ్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. "రియాన్ పరాగ్ ఎంతో ప్రతిభావంతుడు. దూకుడుగా ఆడే సత్తా ఉన్న ఆటగాడు. అతడు మిడిల్ ఆర్డర్లో కీలక పాత్ర పోషిస్తాడు. అంతేకాదు పరాగ్ మంచి ఫీల్డర్ కావడం, పార్ట్ టైమ్ బౌలర్ గానూ ఉపయోగపడతాడు. అంతేకాకుండా తిలక్ వర్మ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. ఈ అంశాలన్ని రియాన్ పరాగ్ శ్రీలంక టూర్కు ఎంపిక కావడంలో కీలకపాత్ర పోషించాయి అని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. భారత్, శ్రీలంక మధ్య జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు, ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్లు జరగనున్నాయి.