Responsive Header with Date and Time

మద్యం మాఫియాను వదలం...

Category : | Sub Category : రాజకీయం Posted on 2024-07-25 10:51:53


మద్యం మాఫియాను వదలం...

వైకాపా మద్యం దోపిడీ విధానం వల్ల గత ఐదేళ్లలో రాష్ట్ర ఖజానాకు రూ.18,860.51 కోట్ల మేర నష్టం వాటిల్లిందనేది ప్రాథమిక అంచనా. మొత్తం ఎంత అవినీతి జరిగిందో తేల్చాలంటే లోతుల్లోకి వెళ్లి దర్యాప్తు చేయాలి. అక్రమాలన్నింటినీ వెలికితీసి చర్యలు తీసుకుంటాం.   :చంద్రబాబు


TWM News: వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఐడీతో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ వేదికగా ప్రకటించారు.అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సహకారం కూడా తీసుకుంటామని, వారికి కేసు రిఫర్ చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం విక్రయించిన మద్యం వల్ల ఎంతమంది ఆరోగ్యాలు నాశనమయ్యాయి? ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? ఎంతమంది మంగళసూత్రాలు తెగిపోయాయి తదితర లెక్కలన్నీ వైద్యారోగ్య శాఖ ద్వారా తేలుస్తామని చెప్పారు. రాష్ట్ర ఖజానాకు సమకూరాల్సిన ఆదాయాన్ని ఎలా పక్కదారి పట్టించారో బయటపెడతామన్నారు. 'గత ఐదేళ్లలో దాదాపు రూ. లక్ష కోట్ల విలువైన మద్యం విక్రయాలు నగదు రూపంలోనే జరిగాయి. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్ము విషయంలో ఇంత పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరగటం ఎక్కడా లేదు. తద్వారా నల్లధనం పోగేసుకున్నారు. సొంత డిస్టిలరీల ఏర్పాటు, మద్యం తయారీ, సరఫరా ఇలా ప్రతి దశలోనూ అక్రమాలకు పాల్పడ్డారు' అని చంద్రబాబు అన్నారు. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై శ్వేతపత్రాన్ని ఆయన శాసనసభలో బుధవారం విడుదల చేశారు. ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి కుంభకోణాన్ని చూడలేదని అన్నారు.

అవకతవకల్ని మంత్రులు బయటపెట్టాలి.
'గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో జరిగిన అవకతవకల్ని సంబంధిత మంత్రులు బయటపెట్టాలి. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సిందే. భవిష్యత్తులో ఎవరైనా తప్పు చేయాలంటే భయపడాలి. ఆ దిశగా అందరం ఆలోచిద్దాం. మీ సలహాలు ఇవ్వండి' అని చంద్రబాబు సభ్యుల్ని కోరారు.

బండ్లపై గంజాయి విక్రయాలు
'మద్యం తయారయ్యాక దాని ప్యూరిఫికేషన్కు తగిన సమయం ఇవ్వకుండానే దుకాణాలకు పంపించేశారు. దాని వల్ల ప్రజారోగ్యానికి ప్రమాదమని తెలిసినా పట్టించుకోలేదు. మద్యం రేట్లు విపరీతంగా పెంచేయటంతో.. తక్కువ ధరకు లభిస్తుందని చాలామంది నాటుసారాకు, గంజాయికి అలవాటుపడ్డారు. ఇళ్లల్లోనూ, పొలాల్లో సైతం గంజాయి పండించారు. చివరికి ఆకుకూరల మాదిరిగా బండ్లపై గంజాయి విక్రయించే పరిస్థితి వచ్చింది. గంజాయి తాగి ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. వినుకొండలో కూడా గంజాయి మత్తులోనే హత్య చేశారు. అందుకే గంజాయి, మాదకద్రవ్యాల కట్టడికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాం. జంగారెడ్డిగూడెంలో కల్తీసారా వల్ల 21 మంది ప్రాణాలు కోల్పోయారు' అని చంద్రబాబు వెల్లడించారు.





Search
Categories
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: