Category : | Sub Category : క్రీడా Posted on 2024-07-24 09:55:44
ఆమె వయసు వాళ్లు ఎప్పుడో ఆట వదిలేశారు.కొంతమంది కోచ్లు అయ్యారు.ఇంకొందరు విశ్రాంతి తీసుకుంటున్నారు.
పారిస్: ఆమె వయసు వాళ్లు ఎప్పుడో ఆట వదిలేశారు.. కొంతమంది కోచ్లు అయ్యారు..ఇంకొందరు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె మాత్రం ఇంకా పోరాడుతోంది. 61 ఏళ్ల వయసులో పారిస్ ఒలింపిక్స్క వచ్చి యువతరంతో సై అంటోంది. ఆ బామ్మే జిల్ ఇర్వింగ్. కెనడాకు చెందిన ఈక్వెస్ట్రియన్ క్రీడాకారిణి. గుర్రాల స్వారీ అంటేనే కష్టమైన విషయం అలాంటిది ఆరుపదుల వయసులో ఈ క్రీడలో కొనసాగడంటే సాహసమనే చెప్పాలి. అదే చేస్తోంది ఇర్వింగ్.పారిస్లో ఈక్వెస్ట్రియన్ టీమ్ విభాగంలో ఆమె పోటీపడుతోంది. ఈ క్రీడల్లో బరిలో ఉన్న పెద్ద వయస్కురాలు ఇర్వింగే. ఇంకా చిత్రమేంటంటే ఆమెకు ఇదే తొలి ఒలింపిక్స్. ఆ ఆటపై పట్టు ఉన్నా 2008 నుంచే ఈక్వెస్ట్రియన్లో ప్రొఫెషనల్గా మారింది. 2019 పాన్ అమెరికా క్రీడల్లో కెనడా స్వర్ణం గెలవడంలో ఇర్వింగ్ కీలకపాత్ర పోషించింది. టోక్యో ఒలింపిక్స్లో పోటీపడే అవకాశం వచ్చినా ఆమె ఆడే గుర్రానికి వయోభారం కారణంగా పాల్గొనలేకపోయింది. కానీ నిరుత్సాహానికి గురి కాకుండా పారిస్ క్రీడలకు అర్హత సాధించింది. 11 ఏళ్ల 11 నెలల జెంగ్ (చైనా, స్కేటింగ బోర్డింగ్) పారిస్లో పోటీపడుతున్న అథ్లెట్లలో పిన్న వయస్కురాలు.