Responsive Header with Date and Time

2024-25: కేంద్ర బడ్జెట్ నేడే !

Category : | Sub Category : రాజకీయం Posted on 2024-07-23 09:09:36


2024-25: కేంద్ర బడ్జెట్ నేడే !

TWM NEWS: దిల్లీ: అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాకారం దిశగా అడుగులేస్తోన్న కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్ను మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి సమర్పిస్తున్న బడ్జెట్ ఇది. నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజలు పన్ను ఉపశమనాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్నే ప్రవేశపెట్టింది. ప్రధాని మోదీ సారథ్యంలోని 3.0 ప్రభుత్వం పూర్తిస్థాయి పద్దును మంగళవారం సమర్పించనుంది. అభివృద్ధి, సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని, వృద్ధికి ఊతమివ్వడంతో పాటు ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యతల మేరకు నిధులు కేటాయించే అవకాశం ఉంది.

ఉభయ సభల్లో 20 గంటల పాటు చర్చ

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై లోక్సభ, రాజ్యసభల్లో చెరో 20 గంటల పాటు చర్చ జరిగే అవకాశం ఉంది. దిగువసభలో రైల్వేలు, విద్య, ఆరోగ్యం, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తదితర అంశాలను ప్రత్యేకంగా చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వివిధ పార్టీల ఎంపీలతో కూడిన సభా వ్యవహారాల కమిటీ సోమవారం భేటీ అయ్యి ఈ మేరకు ఎజెండాను ఖరారు చేసింది.

Search
Categories
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: