Category : | Sub Category : క్రీడా Posted on 2024-07-20 09:59:33
కోహ్లి ప్రవర్తనాతీరును విమర్శిస్తూ అమిత్ మిశ్రా చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప మరోసారి స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. తొలినాళ్లలో ఉన్నట్లు ఇప్పుడు కోహ్లి ప్రవర్తించడం లేదని మిశ్రా వ్యాఖ్యలను తప్పుబట్టేలా ఇప్పటికే యువ క్రికెటర్ శశాంక్ సింగ్ స్పందించాడు. మరో ఆటగాడు రాబిన్ ఉతప్ప కూడా కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. పదిహేనేళ్ల కిందట విత్తిన పంట ఇప్పుడు మరింత ఏపుగా పెరుగుతోందని అభినందించాడు. కెరీర్ ఆరంభంతో పోలిస్తే చాలా పరిణితి చెందాడని పేర్కొన్నాడు."దిల్లీ జట్టుకు ఆడుతున్నప్పటి నుంచి విరాట్ను చూస్తూనే ఉన్నా. నిరంతరం అతడు ఎదుగుతున్న తీరు అద్భుతం. 15 ఏళ్ల కిందట అతడు నాటిన విత్తనం (ఆట) ఇప్పుడు ఫలితాలను అందిస్తోంది. చీకూ (విరాట్) గురించి ఎప్పుడూ నాకు ఆశ్చర్యం కలిగించే అంశం ఒకటుంది. తనపై అత్యంత ఎక్కువగా నమ్మకం ఉంచుకుంటాడు. ఈ విషయంలో మరెవరూ అతడి దరిదాపుల్లోకి రాలేరు. 19 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడు కూడా విరాట్ కోహ్లి ఎప్పుడూ ఆట గురించే మాట్లాడుతూ ఉండేవాడు. ఒక్కోసారి ఆ మాటలు వింటుంటే 'అసలు ఏం మాట్లాడుతున్నాడు?' అని అనుకుంటాం. ఓ పదేళ్ల కాలం తర్వాత 'ఓకే. అప్పుడు కోహ్లి చెప్పిందిదే కదా' అని మనకు అనిపిస్తుంది. వ్యక్తిత్వంలోనూ, ఆటలోనూ నిరంతరం మెరుగవుతూ పరిణితి సాధించడం అభినందనీయం” అని ఉతప్ప తెలిపాడు.
దిల్లీ జట్టుకు ఆడుతున్నప్పటి నుంచి విరాట్ను చూస్తూనే ఉన్నా. నిరంతరం అతడు ఎదుగుతున్న తీరు అద్భుతం. 15 ఏళ్ల కిందట అతడు నాటిన విత్తనం (ఆట) ఇప్పుడు ఫలితాలను అందిస్తోంది. చీకూ (విరాట్) గురించి ఎప్పుడూ నాకు ఆశ్చర్యం కలిగించే అంశం ఒకటుంది. తనపై అత్యంత ఎక్కువగా నమ్మకం ఉంచుకుంటాడు. ఈ విషయంలో మరెవరూ అతడి దరిదాపుల్లోకి రాలేరు. 19 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడు కూడా విరాట్ కోహ్లి ఎప్పుడూ ఆట గురించే మాట్లాడుతూ ఉండేవాడు. ఒక్కోసారి ఆ మాటలు వింటుంటే 'అసలు ఏం మాట్లాడుతున్నాడు?' అని అనుకుంటాం. ఓ పదేళ్ల కాలం తర్వాత 'ఓకే. అప్పుడు కోహ్లి చెప్పిందిదే కదా' అని మనకు అనిపిస్తుంది. వ్యక్తిత్వంలోనూ, ఆటలోనూ నిరంతరం మెరుగవుతూ పరిణితి సాధించడంఅభినందనీయం అని ఉతప్ప తెలిపాడు.టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో (T20 World cup 2024) కీలక ఇన్నింగ్స్ విరాట్ కోహ్లి భారత్ను విజేతగా నిలిపాడు. అప్పటి వరకు పెద్దగా రాణించని అతడు.. తుది పోరులో మాత్రం స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆకట్టుకోవడం విశేషం. ప్రస్తుతం కుటుంబంతో లండన్లో ఉన్న కోహ్లి వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనలో పాల్గొనున్నాడు.
లంకతో వన్డే సిరీస్కు(SL vs IND) అందుబాటులో ఉంటానని చెప్పడంతో.. బీసీసీఐ కూడా 50 ఓవర్ల సిరీస్కు ఎంపిక చేసింది. గంభీర్ ప్రధాన కోచ్గా రావడంతో ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని ఆందోళనకు గురైన అభిమానులకు.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు.