Category : | Sub Category : క్రీడా Posted on 2024-07-19 09:47:32
మహిళల క్రికెట్లో ఓ మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. శ్రీలంక వేదికగా ఆసియాకప్ జరగబోతోంది.
నేటి నుంచే ఆసియాకప్
తొలి పోరులో పాక్ తో భారత్ ఢీ
రా. 7 గంటల నుంచి
మహిళల క్రికెట్లో ఓ మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. శ్రీలంక వేదికగా ఆసియాకప్ జరగబోతోంది. ఎనిమిది జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతోంది. తన తొలి మ్యాచ్లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత్ తలపడబోతుండడం విశేషం.
దంబుల్లా: మహిళల ఆసియాకప్ టీ20 టోర్నమెంట్కు వేళ్లింది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్..శుక్రవారం గ్రూప్-ఏ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో పోటీపడనుంది. ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ను 1-1తో ముగించిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు.ఆసియాకప్లోనూ ఫేవరెట్గా బరిలో దిగుతోంది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అదిరే ఫామ్లో ఉండడంటీమ్ ఇండియాకు కలిసొచ్చే అంశం. అయితే హర్మన్ ప్రీత్, జెమీమా, దీప్తిశర్మ స్థిరంగా రాణించలేకపోవడం.
ఓపెనింగ్లో షెఫాలి వర్మ అడపాదడపా మాత్రమే మెరుపులు మెరిపిస్తుండడం ప్రతికూలతలు. దీనికి తోడు బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చేస్తుండడం కలవరపరిచే అంశం. మరోవైపు పాక్పై భారత్కు మంచి రికార్డు ఉంది. ఇప్పటిదాకా 14 మ్యాచ్లో 11 గెలిచింది. కెప్టెన్, ఆల్రౌండర్ నిదాతో పాటు బ్యాటింగ్లో సిద్రా, ఆలియా.. బౌలింగ్లో ఫాతిమా నప్రా ఆ జట్టుకు కీలకం. శుక్రవారం గ్రూప్-ఏ పోరులో యూఏఈతో నేపాల్ తలపడబోతోంది.