Category : | Sub Category : రాజకీయం Posted on 2024-07-19 08:36:15
TWM NEWS హైదరాబాద్: పంట రుణాల మాఫీ పథకంలో తొలి విడతగా రూ. లక్షలోపు మాఫీకి రాష్ట్ర
ప్రభుత్వం 11,50,193 మంది రైతుల ఖాతాలకు రూ.6,098.93 కోట్లు విడుదల చేసింది. తొలి విడతలో 10,84,050 కుటుంబాలకు లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా రూ.454.49 కోట్లు మాఫీ అయ్యాయి. జిల్లాలోని 78,463 కుటుంబాలకు చెందిన 83,124 మంది రైతులకు రూ. లక్షలోపు రుణం మాఫీ అయింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అతి తక్కువగా
2,667 కుటుంబాలకు చెందిన 2,781 మంది రైతులకు రూ.12.53 కోట్లు మాఫీ అయింది. నియోజకవర్గాల వారీగా చూస్తే అందోలులో అత్యధికంగా 19,186 కుటుంబాలకు చెందిన 20,216 మంది రైతులకు రూ.107.83 కోట్లు జమ అయ్యాయి. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఒకే ఒక్క రైతుకు రూ.50,370 మాఫీ అయ్యాయి. కుత్బుల్లాపూర్లో 44 మందికి రూ.17 లక్షలు, వరంగల్ -తూర్పులో 102 మందికి రూ.38 లక్షలు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 112 మందికి రూ.42 లక్షలు మాఫీ అయ్యాయి. రాష్ట్రంలోని 32 బ్యాంకులకు చెందిన 4,276 శాఖలు, 9 డీసీసీబీలు, 61 సీడెడ్ సొసైటీల పరిధిలో రుణమాఫీ వర్తింపజేశారు.