Category : | Sub Category : క్రీడా Posted on 2024-07-16 09:59:11
TWM News : ఒలింపిక్స్లో రికర్వ్ విభాగంలో మాత్రమే ఆర్చరీ పోటీలుంటాయి. కాంపౌండ్కు ఇందులో చోటు లేదు. రికర్స్లో భారత్ ప్రస్తుతం ఉత్తమంగా కనిపిస్తోంది.
పారిస్ ఒలింపిక్స్ మరో 10రోజుల్లో...
1988 నుంచి ఒలింపిక్స్ ఆర్చరీలో భారత్ పోటీపడుతోంది. కానీ ఇప్పటివరకూ ఒక్క పతకమూ గెలవలేకపోయింది. ప్రతిసారి పతక వేటకు వెళ్లడం.. రిక్తహస్తాలతో తిరిగిరావడం. కానీ ఈ సారి భారత ఆర్చరీ జట్టు మెరుగ్గా కనిపిస్తోంది. 12 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయిలో బరిలో దిగుతున్న మన ఆర్చర్లు అంచనాల మేర రాణిస్తే పతక బోణీ కొట్టే అవకాశముంది. ముఖ్యంగా విజయవాడ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ పతక ఆశలు రేపుతున్నాడు.
ఒలింపిక్స్లో రికర్వ్ విభాగంలో మాత్రమే ఆర్చరీ పోటీలుంటాయి. కాంపౌండ్కు ఇందులో చోటు లేదు. రికర్వ్ భారత్ ప్రస్తుతం ఉత్తమంగా కనిపిస్తోంది. 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత తొలిసారి పూర్తి కోటా ఆర్చర్లను పారిస్కు భారత్పంపుతోంది. ఆరుగురు ఆర్చర్లు పతక వేటకు సై అంటున్నారు. పురుషుల్లో బొమ్మదేవర ధీరజ్, తరుణ్ దీప్ రాయ్ప్రవీణ్ జాదవ్.. మహిళల్లో దీపిక కుమారి, భజన్ కౌర్, అంకిత భకత్ బరిలో దిగబోతున్నారు. వ్యక్తిగత (పురుషులు, మహిళలు)టీమ్ (పురుషులు, మహిళలు), మిక్స్డ్ విభాగాల్లో మన ఆర్చర్లు తలపడనున్నారు. 30 ఏళ్ల దీపిక, 40 ఏళ్ల తరుణ్ కు ఇవి నాలుగో ఒలింపిక్స్. ప్రవీణ్ రెండోసారి ఈ విశ్వక్రీడల్లో ఆడబోతున్నాడు. ధీరజ్, భజన్, అంకిత అరంగేట్రం చేయనున్నారు. టీమ్ విభాగంలో పురుషుల, మహిళల జట్లు నేరుగా ఒలింపిక్స్క అర్హత సాధించడంలో విఫలమయ్యాయి. ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా పారిస్ కోటా స్థానాలు సాధించాయి.
ధీరజ్ ధీమా...
ఈ ఒలింపిక్స్లోలో 22 ఏళ్ల తెలుగు ఆర్చర్ ధీరజ్పై మంచి అంచనాలున్నాయి. అతను గతేడాది ఆసియా క్వాలిఫయర్స్లోసత్తాచాటి ఒలింపిక్స్ బెర్తు పట్టేశాడు. ఆర్చరీలో పారిస్ ఒలింపిక్స్ బెర్తు దక్కించుకున్న తొలి భారత ఆర్చర్ అతనే. గత కొంతకాలంగా అతను నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పుడు అదే ఉత్సాహంతో కొత్త చరిత్ర లిఖించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆర్చరీలో భారత్కు తొలి పతకాన్ని అందించే సత్తా అతనికి ఉంది. అంటాల్యా ప్రపంచకప్ లో వ్యక్తిగత కాంస్యంతో అదరగొట్టాడు. వ్యక్తిగత విభాగంలో అత్యధిక పాయింట్లు (689/720) సాధించిన భారత ఆర్చర్ అతనే. చెరుకూరి వోల్గా ఆర్చరీ అకాడమీలో శిక్షణతో రాటుదేలిన ధీరజ్ ప్రస్తుతం భారత సంబర్వన్ రికర్వ్ ఆర్చర్గా కొనసాగుతున్నాడు. గతేడాది ఆసియా క్రీడల్లో పురుషుల టీమ్ రజతం, ఈ ఏడాది ఏప్రిల్ షాంఘై ప్రపంచకప్లో చారిత్రక టీమ్ స్వర్ణం గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకూ ప్రపంచకప్ ల్లో వివిధ విభాగాల్లో కలిపి ఓ స్వర్ణం రజతం, 6 కాంస్యాలు గెలిచాడు. అతడు పారిస్ లో ఒత్తిడిని దాటి, నిలకడ కొనసాగిస్తే పతకం గెలిచే అవకాశముంది. మరోవైపు పురుషుల టీమ్ విభాగంలో తరుణ్ప్, ప్రవీణ్ తో కలిసి ధీరజ్ పతకం కోసం గట్టిపోటీనిచ్చే ఆస్కారముంది.
దీపికపై దృష్టి...
మహిళల్లో సీనియర్ ఆర్చర్ దీపికపై ప్రత్యేక దృష్టి నెలకొంది. 2022 డిసెంబర్ లో బిడ్డకు జన్మనిచ్చిన దీపిక 14 నెలల విరామం తర్వాత తిరిగి ఆటలో అడుగుపెట్టి రాణిస్తోంది. ఆసియా కప్లో స్వర్ణం, షాంఘై ప్రపంచకప్ లో రజతంతో మెరిసింది. టోక్యోలో క్వార్టర్స్ వరకూ వెళ్లిన ఆమె ఈ సారి పతక కలను నిజం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలో దిగనుంది. మరోవైపు 18 ఏళ్ల భజన్, 26 ఏళ్ల అంకిత ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. ఈ ఏడాది చివరి ఒలింపిక్ క్వాలిఫయర్లో స్వర్ణంతో భజన్ నేరుగా పారిస్ బెర్తు పట్టేసింది. గతేడాది ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన మహిళల జట్టులో భజన్, అంకిత ఉన్నారు. ఒలింపిక్స్లోలో మన ఆర్చర్లకు దక్షిణ కొరియా నుంచి కఠినమైన పోటీ ఎదురయ్యే అవకాశముంది.