Category : | Sub Category : బ్రేకింగ్ వార్తలు Posted on 2024-07-16 08:51:04
న్యాయవాది చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. నేరాభియోగాలపై విచారణల నుంచి మాజీ అధ్యక్షులకూ మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొద్దిరోజులకే ఈ కేసులోనూ ట్రంప్ భారీ ఉపశమనం పొందారు. 2021 జనవరిలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ట్రంప్... ప్రభుత్వానికి చెందిన కీలక పత్రాలను ఫ్లోరిడాలోని తన ఎస్టేట్కు భారీగా తరలించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. శ్వేతసౌధాన్ని ఖాళీ చేసేందుకు తక్కువ సమయం ఇవ్వడంతో ఆ హడావుడిలో కొన్ని పత్రాలు వచ్చి ఉంటాయని ఆయన కార్యాలయం అప్పట్లో ప్రకటించింది. పత్రాలను తిరిగి తీసుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాన్ని ట్రం ప్అ డ్డుకున్నారు. 2022 జనవరిలో ఎఫ్బీఐ అధికారులు ట్రంప్ ఎస్టేట్లో సోదాలు చేపట్టారు.
మొత్తంగా 15 పెట్టెల్లో 184 పత్రాలు లభ్యమయ్యాయి. ఇందులో 67 విశ్వసనీయ, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆగస్టులోనూ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఎఫ్బీఐ మరోసారి ఆ ఎస్టేట్పై దాడిచేసి 20 పెట్టెలనిండా పత్రాలను సీజ్ చేసింది.