Responsive Header with Date and Time

రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే వారం నుంచే రుణమాఫీ..

Category : | Sub Category : రాజకీయం Posted on 2024-07-10 12:43:57


 రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే వారం నుంచే రుణమాఫీ..

హైదరాబాద్: రైతులకు గుడ్ న్యూస్‌ను తెలంగాణ ప్రభుత్వం అందించింది. వచ్చే వారం నుంచి రైతు రుణ మాఫీకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వ్యవసాయ శాఖకు తొమ్మిది వేల కోట్ల వరకూ నిధులను ప్రభుత్వం సమకూర్చింది. మిగతా రుణాల కోసం సన్నద్ధమవుతోంది. ఆగస్టు 15 లోగా మొత్తం రుణమాఫీ చేసేందుకు కసరత్తు పూర్తి చేయనుంది. ఆదాయం వచ్చే మార్గాలపై ఆర్థిక శాఖ ఇప్పటికే దృష్టి సారించింది. భూములను తాకట్టు పెట్టి కొత్త రుణాల కోసం సర్కార్ ప్లాన్ చేసింది. మొత్తం రైతుల రుణమాఫీ కోసం రూ.32 వేల కోట్లు ప్రభుత్వానికి అవసరముంది. రుణమాఫీలో లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇంజనీర్లకు మినహాయింపు ఉంటుంది

రుణమాఫీపై రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు | Good news for  Telangana farmers on loan waiver - Telugu Oneindia
ఋణమాఫీతో పాటు రైతు భరోసాపై ప్రభుత్వం ముందడుగు వేసింది. ఐదు లేదా పదెకరాలకా? అన్న విషయంపై ఇవాళ క్షేత్ర స్థాయి అభిప్రాయం తీసుకోనున్నారు. నేటి నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా రైతు భరోసాపై వర్క్ షాపులు నిర్వహించనున్నారు. వచ్చిన అభిప్రాయాలను కలెక్టర్‌ల ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. రైతు భరోసాపై ప్రభుత్వం మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చైర్మన్‌గా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబులు సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

Search
Categories
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: