Responsive Header with Date and Time

కారు డ్రైవర్‎గా జీవనం.. కటకటాలపాలైన జీవితం.. అసలు స్టోరీ ఇదే..

Category : | Sub Category : నేర Posted on 2024-03-15 11:03:57


కారు డ్రైవర్‎గా జీవనం.. కటకటాలపాలైన జీవితం.. అసలు స్టోరీ ఇదే..

TWM News : ఒకరు భర్తను విడిచిపెట్టారు. మరొకరు భార్యను విడిచి పెట్టారు. వారిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడిన ఈ జంటకు సంపాదన సరిపోలేదు. చెడు వ్యసనాలకు బానిసైన వీరిద్దరూ ఈజీ మనీ కోసం దారి దోపిడీలకు పథకం వేశారు. కానీ ఈ జంటకు దోపిడీలకు కొత్త కావడం, అనుభవం లేకపోవడంతో చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. ఏపిలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన చెమట గోపికృష్ణ.. కుటుంబ గొడవలతో భార్యను వదిలేసిన ఒంటరిగా ఉంటున్నాడు. ఇదే పట్టణంలోని సుగాలీ కాలనీకి చెందిన చింతల మహేశ్వరి భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో ఒంటరిగా జీవిస్తుంది. ఏడాది క్రితం వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. తిరుపతిలో ప్రేమ పెళ్లి చేసుకొని జీవిస్తున్నారు. గోపి కృష్ణ వృత్తిరీత్యా కారు డ్రైవర్‎గా, మహేశ్వరి కూలీ పనులు చేస్తూ ఉన్నారు. కష్టపడి సంపాదించిన ఆదాయం.. కుటుంబ అవసరాలకు సరిపోకపోవడం, జల్సాలకు అలవాటు పడిన వీరూ దోపిడీలు, దొంగతనాలకు పథకం వేశారు. వీరు AP05 DT 2123 అనే నెంబర్ గల కారును కిరాయికి తీసుకున్నారు. ఈ కారులో ఒంటరిగా ప్రయాణించే వారిని టార్గెట్ చేసుకొని కారులో ఎక్కించుకుంటారు. మార్గమధ్యలో నిర్మానుష ప్రాంతాలలో కారు అపి.. ప్రయాణికులను తమ వద్ద ఉన్న కత్తులతో బయపెట్టి వారి వద్ద ఉన్న బంగారం, డబ్బులను దోచుకోవాలనేది వీరు పధకం పన్నారు.ఈనెల 10న బూరుగుపాడు గ్రామానికి చెందిన దుగ్గి కృష్ణారావు హైదరాబాదులో ఉంటున్నాడు. తన బంధువు చనిపోవడంతో కృష్ణారావు పిడుగురాళ్లకు వచ్చాడు. రాత్రి తిరుగు ప్రయాణంలో గోపికృష్ణ కారును టాక్సీ మాట్లాడుకుని కృష్ణారావు హైదరాబాద్ బయలుదేరాడు. మార్గ మధ్యలో నల్గొండ బైపాస్ నుండి కాకుండా నల్గొండ టౌన్‎లో నుండి దేవరకొండ రోడ్‎లోని కొత్తపల్లి శివారులో గంగమ్మ గుడి వద్ద కారును గోపికృష్ణ, మహేశ్వరిలు ఆపారు. వారి వద్ద కత్తులతో కృష్ణారావును చంపుతామని బెదిరించారు. తన మెడలోని 15 గ్రాముల గోల్డ్ చైన్‎ను ఇచ్చి కృష్ణారావు పారిపోయాడు. నేరుగా ఇంటికి వెళ్ళిన బాధితుడు కృష్ణారావు మరుసటి రోజు నల్లగొండ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మర్రిగూడ బైపాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వీరిని అదుపులోకి తీసుకొని విచారించారు. వీరి నుండి గోల్డ్ చైన్, రెండు కత్తులు, రెండు మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు నల్లగొండ డిఎస్పి శివరాంరెడ్డి తెలిపారు. అపరిచితుల వాహనాల్లో ప్రయాణించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.


Search
Categories
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: