Responsive Header with Date and Time

ప్రజలకు గుడ్ న్యూస్... ఫోన్ పోతే ఇలా చేయండి... వెంటనే ఇచ్చేస్తారు...

Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-03-14 14:17:31


ప్రజలకు గుడ్ న్యూస్... ఫోన్ పోతే ఇలా చేయండి... వెంటనే ఇచ్చేస్తారు...

TWM News : ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీసులు శుభవార్త చెప్పారు. ఇక మీదట మీరు పోగొట్టుకున్న విలువైన సెల్ ఫోన్ జాడను ఇట్టే పసిగట్టి.. తిరిగి యజమానికి అప్పగించే గొప్ప క్రియను పోలీసు శాఖ ప్రారంభించింది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు చాట్ బాట్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ విభాగంలో డిప్యూటీ పోలీస్ కమిషనర్లు అధిరాజ్ సింగ్ రాణా, కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుల ఫోన్ల జాడను గుర్తించి మొబైల్ ఫోన్లను అందించారు.

సిటిజన్ ఫ్రెండ్లీ అండ్ రెస్పాన్సివ్ పోలీసింగ్‎లో భాగంగా ప్రజల సౌలభ్యం కోసం గత సంవత్సరం జూన్ -6న చాట్ బాట్ సేవలను ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు సుమారు 5,240 మొబైల్స్ మిస్సింగ్ ఫిర్యాదులు వచ్చాయని, గతంలో సుమారు రూ. 50 లక్షల విలువ చేసే 300 పైగా మొబైల్ ” ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుని బాధితులకు అందించామని, బుధవారం సుమారు కోటి రూపాయల విలువ కలిగిన 628 మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించామని వివరించారు. నగరంలోని ప్రజలందరూ ఈ చాట్ బాట్ సేవలను విరివిగా ఉపయోగించుకోవాలని తెలిపారు డీసీపీ తెలిపారు.

ఈ సందర్భంగా నగరంలోని ప్రజలు ఎవరైనా తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకుంటే వెంటనే చాట్ బాట్ వాట్స్ యాప్ నెంబర్ ‘“94406 27057”కు హాయ్ అని మెసేజ్ పంపండి. వెంటనే మీకు ఒక గూగుల్ పేజీ లింక్ వస్తుంది. ఈ లింక్ క్లిక్ చేసి అందులో పోయిన మొబైల్ వివరాలను పొందుపరిస్తే.. ఈ సమాచారంతో సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా ఏర్పాటు చేసి -త్వరితగతిన ఆ మొబైల్ ఫోన్ జాడ గుర్తించి బాధితులకు అందిస్తామని తెలిపారు. ఈ మొబైల్ ఫోన్ల రికవరీలో కీలక పాత్ర పోషించిన పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Search
Categories
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: