Responsive Header with Date and Time

ప్రధాని మోదీ పర్యటన... స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి...

Category : | Sub Category : రాజకీయం Posted on 2024-03-04 12:31:52


ప్రధాని మోదీ పర్యటన... స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి...

TWM News : పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మూడు సిట్టింగ్‌ స్థానాలతో పాటు ఐదుస్థానాలకు అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదుంది కమలం పార్టీ. ఈ నేపథ్యంలో ఫస్ట్ లిస్టు ప్రకటించిన తర్వాత ప్రధాని మోదీ మొదటిసారి తెలంగాణలో పర్యటించబోతున్నారు. సోమవారం, మంగళవారాల్లో ఆదిలాబాద్‌, సంగారెడ్డిలో పర్యటించి 7వేల కోట్ల రూపాయల అభివృద్ది పనులను ప్రారంభించనున్నారు. సంగారెడ్డిలో జరిగే సభలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు ప్రధాని మోదీ. బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో సిట్టింగ్‌ స్థానమైన ఆదిలాబాద్‌ను పెండింగ్‌లో ఉంచారు. సిట్టింగ్‌ ఎంపీ సోయం బాపురావు ఉన్నా.. ఆయనకి టికెట్‌ దక్కలేదు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఆదిలాబాద్ నుంచే తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఈ వేదికపైన సోయంబాపురావ్‌కి ప్రధాని మోదీ హామీ ఇస్తారా? లేక మరొకరిని ప్రకటిస్తారా..? అనేది ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తనకు టికెట్‌ రాకుండా రాష్ట్ర నేతలే కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు సోయం బాపురావ్‌. ఒకవేళ టికెట్‌ రాకపోతే తన దారి తానూ చూసుకుంటానని తెలిపారు.

ఆదిలాబాద్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధాని మోదీతో కలిసి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై ప్రధానిని అధికారికంగా స్వాగతం పలకనున్నారు. ప్రధాని వెంట ముగ్గురు కేంద్రమంత్రుల రానున్నారు. తెలంగాణలో పలు జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఎన్టీపీసీ రామగుండం రెండో యూనిట్, అంబారి- ఆదిలాబాద్ పింపల్ కుట్టి ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.

ఆదిలాబాద్‌లో హై అలర్ట్...

పీఎం‌, సీఎంల రాకతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎస్పీజీ భద్రతా వలయంలో ఏరోడ్రం, ఇందిర ప్రియదర్శిని స్డేడియం, ఎనిమిది హెలిప్యాడ్ లు, 2 వేల మంది భద్రతతో పకడ్భంధీ ఏర్పాట్లు చేశారు. అగ్ర నేతల రాకతో ఆదిలాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. 2 వేల మంది పోలీసులతో భారీ భద్రత.. 300 ఎస్పీజీ భద్రత అదనంగా కేటాయించారు.


Search
Categories
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: