Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-03-04 11:45:48
TWM News : పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఇసుక కుంభ కోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట రేట్ (ఈడీ) నేరుగా దృష్టి సారించింది. ఇసుక రీచ్లు, స్టాక్పాయింట్లలో తనిఖీలు చేపట్టింది. గుత్తేదారు సంస్థలపై దాడులు చేసింది. ఇప్పటికే రూ.4,730 కోట్ల దోపిడీ జరిగినట్లు వెలుగులోకి తెచ్చింది. అక్రమాల్ని అడ్డుకో లేదేమంటూ 10 జిల్లాల కలెక్టర్లను బాధ్యుల్ని చేసింది. విచారణకు రావాలంటూ నోటీసులి చ్చింది. అక్కడి ముఖ్య నేత బంధువు ఒకరు దందాకు సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. ఈడీ రంగ ప్రవేశంతో ఎప్పుడేం జరుగుతుం దోనని తమిళనాడులోని నేతలు, అధికారులు హడలిపోతున్నారు.
ఎప్పుడో మించిపోయాం...
ఇసుక అక్రమాల్లో తమిళనాడును మన రాష్ట్రం ఎప్పుడో మించి పోయింది. జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడ దోపిడీకి అంతేలేదు. రాష్ట్రంలో ఇసుక దందా విలువ రూ.వేల కోట్లలో ఉంటుంది. అధికార పార్టీ నేతలు భారీగా ఇసుకను బొక్కేస్తూ... ప్రజా ధనాన్ని నొక్కేస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్... వివిధ సందర్భాల్లో జోక్యం చేసుకుని, అక్ర మాల్ని ఆపాలని కొరడాలు ఝళిపించినా ఖాతరు చేసేవారే లేరు. ఉత్తరాది కంపెనీల పేరిట, బినామీ కంపెనీలతో అనుమతు లేకుండా తవ్వేస్తున్నారు. తవ్వకాలకు లెక్కల నేవే చూపరు. బిల్లులన్నీ చేతిరాతతోనే. డిజి టల్ పేమెంట్లు ఉండనే ఉండవు. ఈడీ అధికారులు ఒక్కసారి ఇటు దృష్టి పెడితే ఇసు కాసురుల కుంభస్థలాలు బద్దలవడం ఖాయం. రీచ్లలో ఇష్టానుసారం తవ్వేసి... అక్రమంగా అమ్మేసుకుంటున్న బినామీ కంపెనీలు, అనుమతు ల్లేకుండా తవ్వేస్తున్నారు. తవ్వకాలకు లెక్కల నేవే చూపరు. బిల్లులన్నీ చేతిరాతతోనే. డిజి టల్ పేమెంట్లు ఉండనే ఉండవు. ఈడీ అధికారులు ఒక్కసారి ఇటు దృష్టి పెడితే ఇసు కాసురుల కుంభస్థలాలు బద్దలవడం ఖాయం. రీచ్లలో ఇష్టానుసారం తవ్వేసి... అక్రమంగా అమ్మేసుకుంటున్న బినామీ కంపెనీలు, వాటి వెనుక ఉన్న సూత్రధారులు, నాయకగణం, వారికి సహకరిస్తున్న పలు జిల్లాల కలెక్టర్లు గనులశాఖ అధికారులు అడ్డంగా దొరికిపో తారు. ఇసుక దోపిడీలో తమిళనాడునే తలదన్నుతున్న వైకాపా నేతల చేతివాటాన్ని చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే...
అనుమతికి మించి తవ్వకాలు...
తమిళనాడులో 2022 మే నుంచి 2023 సెప్టెంబరు వరకు ప్రభుత్వం ఇసుక తవ్వకాలు, విక్ర యాలు జరిపింది. దీన్ని నేరుగా జలవనరుల శాఖే పర్యవేక్షించింది. వివిధ నదుల్లోని పలు రీచ్ ల్లో కలిపి మొత్తం 195 హెక్టార్లలో ఇసుక తవ్వకాలకు అనుమతిస్తే.. ఏకంగా 987 హెక్టార్లలో ఇసుక తవ్వి, విక్రయించినట్లు ఈడీ తేల్చింది.
ఆంధ్రప్రదేశ్...
జగన్ ప్రభుత్వం బరు 5 నుంచి 2021 మే 14 వరకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీ ఎండీసీ) ద్వారా ఇసుక వ్యాపారం జరిగింది. ఆ తర్వాత 2021 మే 15 నుంచి ప్రైవేటు సంస్థల పేరిట జరుగుతోంది. అవి పర్యావ రణ అనుమతులతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేస్తున్నాయి. 110 రీచ్ ల్లో ఇసుక తవ్వకాలు ఆవేయాలని స్వయంగా ఎన్జీటీ ఆదేశించినా పట్టించుకోలేదు.