Category : | Sub Category : రాజకీయం Posted on 2024-02-29 10:44:12
TWM News :
2019 ఎన్నికల ముందు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజల బుగ్గలు నిమిరి, ముద్దులు పెట్టి జగన్ అడిగారు. ఏదో బాహుబలి సినిమా చూపిస్తారని ప్రజలు నమ్మి ఓట్లేస్తే.. అట్టర్ ఫ్లాప్ సినిమా చూపించారు. అలాంటి సినిమాకు సీక్వెల్ ఉండదు. మేం అధికారంలోకి వస్తే బాదుడు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. పెట్టుబడులు తెచ్చి సంపద సృష్టిస్తాం. నీళ్లిచ్చి రైతుల్ని బతికిస్తాం. యువతకు ఉద్యోగాలిస్తాం. ఇప్పటికే సూపర్-6. పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రకటించాం.- చంద్రబాబు
స్థానాలు తీసుకుంటే.. ఇంతేనా అని అవతలివాళ్లు (వైకాపా) అంటున్నారు. బలిచక్రవర్తి కూడా వామనుణ్ని చూసి ఇంతేనా? అన్నాడు. చివరకు నెత్తిమీద కాలు పెట్టి అథఃపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది. ఎంతో అని.. ఇంతింతై వటుడింతై.. అన్నట్లు జనసేన వామనావతారాన్ని చూపిస్తుంది. జగన్ గుర్తుపెట్టుకో.. అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదు.. నా పార్టీ జనసేన కాదు. -పవన్కల్యాణ్
తెలుగుదేశం, జనసేన కలిసి నిర్వహించిన తెలుగు జన విజయకేతనం జెండా... సభ పేరుకు తగ్గట్టే జనజాతరను తలపించింది. రెండు పార్టీలూ సీట్ల సర్దుబాటు ప్రకటించిన తర్వాత కలిసి నిర్వహించిన తొలి సభ ఇది. తరలివచ్చిన జనసమూహం ఈ కలయికను నిండు మనసుతో ఆశీర్వదించింది. సభా ప్రాంగణం అంతటా తెలుగు దేశం, జనసేన జెండాలు చేబూనిన యువత, మహిళలు సభ జరుగుతున్నంత సేపూ వాటిని రెపరెపలాడిస్తూనే ఉన్నారు. రెండు పార్టీల జెండాలు చేబూని, యుద్ధానికి సిద్ధమంటూ ప్లకా ర్డులు ప్రదర్శిస్తూ జనం చేసిన జయజయ ధ్వానాలు రెండు పార్టీల్లో సమరోత్సాహం నింపాయి. జగన్ ను తరిమికొట్టేందుకు సిద్ధమా అని చంద్రబాబు ప్రశ్నిస్తే జనం అవును అవునంటూ ప్రతిస్పందిం చారు. ఈ పొత్తును ఆశీర్వదిస్తున్నారా అంటే చప్పట్లు కొట్టి మద్దతు పలికారు.
తెలుగు తమ్ముళ్లు, జనసైనికుల నవోత్సాహం.. ఉత్తేజం ఉరకలెత్తించేలా నేతల ప్రసంగం.. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు.. వెరసి తెదేపా, జనసేన ఉమ్మడి బహిరంగ సభా వేదిక ఆసాంతం అభిమానుల్లో చైతన్యం నింపింది. జెండా పేరిట పశ్చిమ గోదావరి జిల్లా తాడేవల్లిగూడెం సమీపంలో బుధవారం నిర్వహించిన ఈ చారిత్రక సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు.