Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-02-28 13:29:43
TWM News : తెదేపా అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చామని గప్పాలు కొట్టుకోడానికి జగన్ సర్కారు నానా తిప్పలు పడుతోంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం బ్రాంచ్ కాలువ (కేబీసీ) పరిధిలోని 110 చెరువులను నింపేందుకు ముఖ్యమంత్రి జగన్ సోమవారం బటన్ నొక్కారు. తాత్కాలికంగా గేటు (షట్టర్) పెట్ ముందుగానే నిల్వ చేసుకున్న నీటిని వదిలి.. కృష్ణమ్మ కుప్పం వైపు బిరబిరా ప్రవహిస్తున్నట్లు బహిరంగ సభలో ప్రజలకు కట్టుకథ చెప్పారు. వాస్తవంగా ఇక్కడ గేటు అవసరం లేకున్నా లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేశారు. భారీస్థాయిలో కృష్ణా జలాలు విడుదల చేస్తున్నామని ఫొటోలకు పోజులు ఇచ్చారు. హెలికాప్టర్లో ఎగిరి వచ్చిన ముఖ్యమంత్రి భారీ ఖర్చుతో బహిరంగ సభ నిర్వహించి, 1,300 బస్సుల్లో ప్రజలను రప్పించి.. కుప్పానికి ఎంతో మేలు చేశామని డబ్బా కొట్టుకున్నారు. ఈ మేరకు నీళ్లనా వచ్చాయా.. అంటే అదీ లేదు.
వి.కోట మండలం కృష్ణాపురం, ఆదినేపల్లి పంప్ హౌస్ ల్లోని మోటార్లను ఆరేడు గంటలు మాత్రమే నడిపిస్తున్నారు. ఎగువ నుంచి పెద్దగా ప్రవాహం లేక కాలువలో నీళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వి.కోట మండలం కనమనాయనిపల్లితోపాటు పలుచోట్ల కేబీసీలో అడ్డుకట్టలు వేసి వచ్చిన నీటిని ఆపేసి.. ఒకస్థాయికి చేరాక ఆ కట్టలను తెంచి దిగువ ప్రాంతాలకు పంపిస్తూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందని బిల్డప్పులు ఇచ్చారు. సీఎం నీటిని విడుదల
చేసిన తర్వాత సోమవారం అర్ధరాత్రికి శాంతిపురం మండలం ఎంకేపురం వరకు కృష్ణా జలాలు రావడమే గగనమైంది. ఉదయానికి అక్కడ నీటి ఆన వాళ్లు కూడా కనిపించలేదు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేటును మంగళవారం ఉదయమే సిబ్బంది తొలగించారు. కాలువల్లో నీటి తడైనా లేకపోవడంతో స్థానికులు, తెదేపా కార్యకర్తలు అందులోకి దిగి సర్కారు తీరును ఎద్దేవా చేశారు. జనాలను ఎందుకు మోసం చేస్తున్నారంటూ జగన్ ను ప్రశ్నించారు. రూ.400 కోట్లు ఖర్చు చేసి చంద్రబాబు కాలువను నిర్మించారన్నారు. సీఎం మాత్రం రూ.కోట్లు ఖర్చు చేసి కుప్పంలో గొప్పలు చెప్పారని ఎద్దేవా చేశారు. గేట్ల వ్యవహారంపై విమర్శలు రావడంతో సిబ్బంది మంగళవారం సాయంత్రం వాటిని మళ్లీ అమర్చారు.
13% పనులు చేయడానికి అయిదేళ్లు పట్టిందా..!
తెదేపా ప్రభుత్వ హయాంలో కుప్పం బ్రాంచ్ కాలువ నిర్మాణానికి రూ.400 కోట్లు ఖర్చు చేసి 87% పనులు పూర్తి చేస్తే.. మిగిలిన 13% పనులు పూర్తి చేయడానికి జగన్కు అయిదేళ్లు పట్టిం దని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముంగిట కాలువలో చెంబెడు నీళ్లు పారించడం గిమ్మిక్కేనని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్వీర్యం చేసి.. కుప్పం ప్రజలకు నీరందించాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
హంద్రీనీవా కుప్పం బ్రాంచి కాలువకు ముఖ్యమంత్రి జగన్ నీళ్లు వదలడం.. ఆయన మూత్రం పోసి వెళ్ల డంలా ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఎద్దేవా చేశారు. తిరు పతిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అప్పటి ముఖ్య మంత్రి నీలం సంజీవరెడ్డి నుంచి ఇప్పటి జగన్మోహన్రెడ్డి వరకు ప్రతి ఒక్కరూ రాయలసీమకు ద్రోహం చేశారని విమర్శించారు. రాయలసీమలో రాళ్లూరప్పలు, బీడు భూములు తప్ప ఏమీ లేవని వాపోయారు.