Category : | Sub Category : బ్రేకింగ్ న్యూస్ Posted on 2024-02-28 12:10:54
TWM News : భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాత్ర గగన్యాన్ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా.. రోద సిలోకి వెళ్లనున్నారు. భారత భూభాగం నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్ష యాత్ర చేయనున్న భారతీయ బృందంగా వీరు చరిత్ర సృష్టించబోతున్నారు.
ఈసారి అన్నీ మనవే : మోదీ
తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని నలుగురు వ్యోమగాములను పరిచయం చేశారు. లేచి నిలబడి కరతాళ ధ్వనులతో వారిని అభినందించారు. వారికి ఆస్ట్రోనాట్ వింగ్స్ అమర్చారు. ఈ వ్యోమగాములు నలుగురు వ్యక్తులు కారని... 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను రోదసిలోకి మోసుకెళ్లే నాలుగు శక్తులు అని కొనియాడారు.నాలుగు దశాబ్దాల తర్వాత భారతీయుడు అంతరిక్షం లోకి పయనమవుతున్నాడని తెలిపారు. ఈసారి కౌంట డౌన్ మనదే.. టైమింగ్ మనదే.. రాకెట్ మనదే అని ఆయన వ్యాఖ్యానించారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామిగా రాకేశ్ శర్మ 1984లో రికార్డు సృష్టిం చారు. అయితే ఆయన రష్యా ప్రయోగకేంద్రం నుంచి వెళ్లిన వ్యోమనౌకలో ఈ ఘనత సాధించారు.
స్వయం సమృద్ధికి తార్కాణం...
గగన్యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన మెజార్టీ భాగాలను భారత్లోనే తయారుచేయడం.. అంతరిక్ష రంగంలో దేశ స్వయంసమృద్ధికి నిదర్శనమని మోదీ తెలిపారు. శిక్షణ సమయంలో వ్యోమగా ములు ఎంతో అంకితభావం ప్రద ర్శించారు. యోగానూ అభ్యసిం చారు. సవాళ్లను అధిగమించే సత్తా, తిరుగులేని నిబద్దతకు నిదర్శనమైన భారతీయ అమృత్ తరానికి వీరు ప్రతినిధులు అని ఆయన పేర్కొన్నారు. చంద మామ నుంచి నమూనాలను తెచ్చేందుకు మళ్లీ వ్యోమనౌకను పంపుతాం. 2035 నాటికి రోద సిలో మన అంతరిక్ష కేంద్రం సిద్ధ మవుతుంది. చందమామ పైకి మన రాకెట్లో వ్యోమగామిని పంపుతాం అని తెలిపారు.
ప్రారంభోత్సవం..: అంతకుముందు ప్రధాని.. తిరువనంత పురం నుంచి అంతరిక్ష రంగానికి సంబంధించిన రూ.1,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవం చేశారు. అందులో శ్రీహ రికోటలోని పీఎస్ ఎల్వీ అనుసంధాన కేంద్రం, తమిళ నాడులోని మహేంద్రగిరిలో సెమీ క్రయోజెనిక్స్ ఇంటి గ్రేటెడ్ ఇంజిన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ, తిరువనం తపురంలోని విక్రమ్సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ట్రైసోనిక్ విండ్ టన్నెల్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్, ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఏమిటీ గగన్యాన్?
గగన్యాన్ యాత్ర 2025లో జరగనుంది. ఇందులో వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులో భూకక్ష్యలోకి పంపుతారు. ఇందుకోసం ఎల్బీఎం- మార్క్ రాకెట్ను ఉపయోగించనున్నారు. దాదాపు 3 రోజుల తర్వాత భూమికి తిరిగొస్తారు. తిరుగు ప్రయాణంలో వ్యోమనౌక సముద్రజలాల్లో ల్యాండ్ అవుతుంది.
అద్భుత ప్రతిభావంతులు...
భారత తొలి అంతరిక్షయాత్ర గగన్యాన్ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాములు.. యుద్ధవిమాన పైలట్లుగా వాయు సేనలో అద్భుత ప్రతిభను చాటారు. వారికి 2 వేల నుంచి 3 వేల గంటల గగనవిహార అను భవం ఉంది. నలుగురూ పుణెకు సమీపంలోని ఖడక్వా స్లాలో ఉన్న ప్రతిష్ఠాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)కి ఎంపికయ్యారు. అక్కడ శిక్షణ పూర్తి చేసు కొని, పైలట్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీకి వెళ్లారు. అగ్రశ్రేణి యుద్ధవిమానాలైన సుఖోయ్-30ఎంకేఐ, మిగ్-29, మిగ్-21, జాగ్వార్, డోర్ని యర్, హాక్ జెట్లతోపాటు డోర్నియర్, ఏఎన్-32 వంటి రవాణా విమానాలను నడిపిన అనుభవం వీరి సొంతం. ఈ నలుగురు.. 13 నెలల పాటు రష్యాలో వ్యోమగామి శిక్షణ పొందారు. ప్రస్తుతం స్వదేశంలో ఇస్రో వారిని తీర్చిదిద్దుతోంది .
గగనయాన్ కోసం ఎంపికైన వ్యోమగాములు...
• ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్: 1976లో కేరళలో
జన్మించారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో అన్ని విభా గాల్లో అత్యుత్తమ ప్రతిభ చాటి.. స్వోర్డ్ ఆఫ్ ఆనర్ దక్కించుకున్నారు. 1998 డిసెంబరులో వాయుసే నలో ఫైటర్ పైలట్గా చేరారు. 3వేల గంటల ఫ్లయింగ్ అనుభవాన్ని సాధించారు. కేటగిరీ-ఏ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ హోదాను పొందారు. అమెరికా లోని యూఎస్ స్టాఫ్ కాలేజీలో శిక్షణ తీసుకున్నారు.
• అజిత్ కృష్ణన్: 1982లో చెన్నైలో జన్మించారు.
ఎయిర్ఫోర్స్ అకాడమీలో రాష్ట్రపతి బంగారు పతకం, స్వోర్డ్ ఆఫ్ ఆనర్ గెల్చుకున్నారు. శిక్షణ అనంతరం 2003 జూన్లో వాయు సేనలో ఫైటర్ పైలట్గా చేరారు. యుద్ధవిమానాల చోదకుడిగా 2,900 గంటల గగనవిహార అనుభవాన్ని గడించారు. ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ హోదాను సాధించారు.
• అంగద్ ప్రతాప్: 1982లో ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్జ్లో జన్మించారు. 2004 డిసెంబరులో ఫైటర్ పైలట్గా వాయు సేనలోకి ప్రవేశించారు. దాదాపు 2వేల గంటల ఫ్లయింగ్ అనుభవం ఆయన సొంతం.
• శుభాన్షు శుక్లా: 1985లో యూపీలోని లఖ్ నవూలో జన్మించారు. 2006 జూన్ లో ఫైటర్ విమానాల పైల ట్గా చేరారు. దాదాపు 2వేల గంటల గగనవిహార అనుభవం సాధించారు.