Responsive Header with Date and Time

రంజీ జెట్టు కెప్టెన్సీ నుంచి విహరిని పీకేశారు ...

Category : | Sub Category : రాజకీయం Posted on 2024-02-27 12:56:08


రంజీ జెట్టు కెప్టెన్సీ  నుంచి విహరిని పీకేశారు ...

TWM News : వైకాపా నాయకులా... మజాకా! వాళ్లు తలుచుకుంటే పారిశ్రామికవేత్తలేం ఖర్మ.. క్రికెటర్లు కూడా రాష్ట్రం నుంచి పారిపోవా ల్సిందే! దేశం తరఫున పలు టెస్ట్మ్యచ్లు ఆడిన అంతర్జాతీయ క్రికెటర్ హనుమ విహారి వైకాపా నాయకుల దెబ్బకు.. జీవితంలో ఇంకెప్పుడూ ఆంధ్రప్రదేశ్ తరఫున రంజీమ్యాచ్లు ఆడ నంటూ తీవ్ర ఆవేదనతో దండం పెట్టి వెళ్లిపో యారు. ఒక అంతర్జా దుస్థితి కల్పించింది.. ఏ ముఖ్యమంత్రి, మంత్రో, వైకాపా అగ్రనేతలో అను కుంటున్నారా? వారి అండదండలు పుష్కలంగా ఉన్న తిరుపతిలోని ఒక సాధారణ కార్పొరేటర్. ఆ నాయకుడి దెబ్బకు హనుమ విహారి వంటి క్రికె టర్ ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు, ఇప్పుడు తీవ్ర అవమానభారంతో ఏకంగా జట్టునే వదిలి వెళ్లిపోయారు. వైకాపా నాయకు లతో పెట్టుకుంటే ఎంతటి స్టార్ ఆటగాళ్లకైనా అదే గతి! మొన్నటికి మొన్న ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడికి వైకాపా నేతల చేతిలో చేదు అనుభవం ఎదురైంది. ఆ దెబ్బకు రాయుడు మళ్లీ కోలుకోలేదు. ఇప్పుడు విహారి వంతు! ఇంతకీ హనుమ విహారి చేసిన తప్పేంటో తెలుసా? ఆంధ్రా రంజీ జట్టులో 17వ సభ్యుడిగా ఉన్న... ఆ వైకాపా కార్పొరేటర్ కుమారుణ్ని ఒక కెప్టెన్గా మందలిం చడం. విహారి ఏడేళ్లుగా ఆంధ్రా రంజీ జట్టుకు కెప్టె న్గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్లో బెంగాల్తో ఆంధ్రా జట్టు మొదటి మ్యాచ్ ఆడింది. ఆ సంద ర్భంగా 17వ ఆటగాడిగా ఉన్న కె.ఎన్. పృథ్వీరాజ్ను ఏ కారణం చేతనో కెప్టెన్ విహారి మందలించారు. అంతే పృథ్వీరాజ్ తండ్రి నర్సింహాచారికి చిర్రెత్తుకొ చ్చింది. ఆంధ్రా క్రికెట్ ఆసోసియేషన్ (ఏసీఏ) మొత్తం వైకాపా నాయకుల గుప్పిట్లోనే ఉండటంతో వారికి ఫిర్యాదు చేశారు. వారు ఆఘమేఘాల మీద స్పందించారు. మావాడి పుత్రరత్నాన్నే తిడతావా? అంటూ మొదటి మ్యాచ్ తర్వాత విహారిని కెప్టెన్సీ నుంచి పీకేసి రికీభుయ్కు సారథ్యం అప్పగించారు. ఇన్నాళ్లూ అవమాన భారాన్ని పంటిబిగువున భరిస్తూ మ్యాచ్లు ఆడిన విహారి... మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో నాలుగు పరుగుల తేడాతో జట్టు ఓడిపో యాక తన మనసులోని ఆవేదనను ఇన్స్టాగ్రామ్ వేది కగా శనివారం బయటపెట్టారు. రాజకీయ జోక్యం వల్ల కెప్టెన్సీ కోల్పోయానని, తీవ్ర అవమానానికి గుర య్యానని ఆయన పెట్టిన పోస్టు... జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం సృష్టించింది. 

ఆత్మగౌరవం దెబ్బతిన్నచోట ఉండలేను...

బెంగాల్ జరిగిన మొదటి మ్యాచ్కు నేనే కెప్టె న్ని. ఆ మ్యాచ్ సందర్భంగా 17వ ఆటగాణ్ని కోప్ప డ్డాను. అతను ఆ విషయం తండ్రికి చెప్పాడు. రాజ కీయ నాయకుడైన ఆయన నాపై చర్య తీసుకోవాలని ఏసీఏని కోరారు. ఆ మ్యాచ్లో బెంగాల్ 410 పరుగుల లక్ష్యాన్ని నిలిపినా... మేం పోరాడి గెలిచాం. గత సీజ న్లో ఫైనల్ కు చేరిన బెంగాల్ను మేం మొదటి మ్యాచ్ లోనే ఓడించినా నన్ను కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సిం దిగా ఏసీఏ ఆదేశించింది. నా తప్పేమీ లేకపోయినా నన్ను కెప్టెన్సీ నుంచి తీసేశారు. ఆ క్రికెటర్ను నేను వ్యక్తిగతంగా ఏమీ అనలేదు. కానీ ఆంధ్ర రంజీ జట్టుకు ఏడేళ్లుగా కెప్టెన్గా వ్యవహరిస్తూ... ఐదు సీజ న్లలో జట్టును నాకౌట్ దశకు చేర్చిన, దేశం తరపున 16 టెస్ట్లు ఆడిన క్రీడాకారుడికంటే జట్టులోని ఒక సభ్యుడే ఎక్కువయ్యారు అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో విహారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కెప్టెన్సీ నుంచి తీసేయడాన్ని చాలా ఇబ్బందికరంగా, అవమానకరంగా భావించానని... కానీ ఆటపైనా, జట్టుపైనా ఉన్న గౌర వంతో ఇన్నాళ్లూ కొనసాగానని తెలిపారు. విషాదం ఏంటంటే.. ఏసీఏ తాను చెప్పిందే ఆటగాళ్లు వినాలను కుంటోంది. తమ వల్లే ఆటగాళ్ళు మనుగడ సాగిస్తున్నా రనుకుంటోంది. తీవ్ర అవమానానికి గురైనా ఇన్నాళ్లూ బయటకు వ్యక్తం చేయలేదు. నా ఆత్మగౌరవానికి భంగం వాటిల్లాక.. ఇక ఆంధ్రా జట్టు తరపున ఆడకూ డదని నిర్ణయించుకున్నాను. ఈ జట్టంటే నాకెంతో ప్రేమ. ఒక్కో సీజన్ గడిచేకొద్దీ టీం మరింతగా ఎదు గుతోంది. కానీ అలా ఎదగడం ఏసీఏకి ఇష్టం లేదు అని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి మ్యాచ్ తర్వాత కెప్టెన్సీ నుంచి ఏసీఏ బలవంతంగా తొలగించినా వ్యక్తిగత కారణాలతోనే కెప్టెన్సీ నుంచి వైదొలగినట్టు అప్పట్లో పేర్కొన్న విహారి, ఈ సీజన్లో ఆంధ్రా జట్టు కథ ముగియడంతో ఇప్పుడు అసలు విష యాన్ని వెల్లడించారు. ఈ సీజన్లో విహారి 13 ఇన్నిం గ్స్ 522 పరుగులు చేశారు. జట్టులో రికీభుయ్ తర్వాత రెండో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుడు ఆయనే. ఆంధ్రా తరపున అంతర్జాతీయ క్రికెట్ అడిన అతికొద్ది మంది క్రీడాకారుల్లో విహారి ఒకరు. భారత్ తరపున ఆయన 16 టెస్ట్ మ్యాచ్లు ఆడి, 839 పరుగులు చేశారు. వెస్టిండీ పై  సెంచరీ కొట్టారు. 

విహారినే కెప్టెన్గా కొనసాగించాలంటూ జట్టు సభ్యుల లేఖ...

హనుమ విహారిని కెప్టెన్గా తొలగించిన తర్వాత... కె. ఎన్. పృథ్వీరాజ్ మినహా జట్టులోని మిగతా 15 మంది సభ్యులూ ఏసీఏ పెద్దలకు ఒక లేఖ రాశారు. విహారి తప్పేమీ లేదని, ఆయననే కెప్టెన్గా కొనసాగించాలని కోరారు. వారిలో విహారి తర్వాత కెప్టెన్గా నియమితు డైన రికీభుయ్ కూడా ఉండటం విశేషం. విహారి అభ్యం తరకర పదజాలంతో దూషించినట్టు, దురుసుగా తన పైకి దూసుకొచ్చినట్టు మా సహచర సభ్యుడొకరు ఫిర్యాదు. చేశారు. విహారి దురుసుగా దూసుకొచ్చాడన్నది నిజం కాదు. సహచర సభ్యుల నుంచి మెరుగైన ఆటను రాబట్టే క్రమంలో డ్రెస్సింగ్ రూమ్లో అలాంటి భాషను వాడటం ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ దురదృష్టవశాత్తు మా జట్టు సభ్యుడు దాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నాడు. ఆ రోజు ఏం జరిగిందనడానికి మా 15 మంది ఆటగా ళ్లతోపాటు, సహాయ సిబ్బంది కూడా సాక్షులుగా ఉన్నారు. విహారితో మాకెలాంటి సమస్యలూ లేవు. ఆయన ఎప్పుడూ మా నుంచి ఉత్తమమైన ఆటను రాబ ట్టేందుకు కృషి చేస్తారు. విహారి నాయకత్వంలో జట్టు సాధించిన విజయాలే దానికి నిదర్శనం. ఈ రంజీ పోటీలు మా కెరీర్కు ఎంతో ముఖ్యమైనవి. పైగా బెంగాల్పై తొలి మ్యాచ్లో అద్భుతమైన విజయం సాధించాం. మా కెప్టెన్గా విహారినే కొనసాగించాలని కోరుతున్నాం అని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన ఆటగాడు తప్ప మిగతా వారంతా విహారి పక్షానే నిలిచినా, ఏసీఏ మాత్రం రాజకీయ ఒత్తి ళ్లకు తలొగ్గి ఆయనను కెప్టెన్సీ నుంచి తొలగించడం.

వైకాపా నాయకుల దాష్టీకానికి పరాకాష్ఠ...

విచారణ విహారి మీదే: ఓవైపు విహారికి జరిగిన అన్యాయంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ, అతస్థాయిలో చర్చ జరుగుతూ, అతడికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండగా.. ఏసీఏ మాత్రం ఈ వ్యవహారంపై బాధితుడైన అతడి మీదే విచారణకు సిద్ధమవడం గమనార్హం. విహారి అసభ్య భాష, ప్రవర్తనపై జట్టు సభ్యులు, సహాయ సిబ్బంది, ఏసీఏ పాలకుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై ఏసీఏ పూర్తి స్థాయి విచారణ చేపడుతుంది అని ఏసీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. విహారి ఆరోపణలపై ఏసీఏ మీడియా మేనేజర్ రాజగోపాల్ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. ఏసీఏ ఆటగాళ్లందర్నీ ఒకేలా చూస్తుంది. సీనియారిటీ ఆధారంగా ఎవరికీ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వదు. బెంగాల్ మ్యాచ్ సందర్భంగా జట్టు సభ్యుడు ఒకర్ని విహారి అసభ్య పదజాలంతో దూషించి నట్టు మా దృష్టికి వచ్చింది. విహారి జాతీయ క్రికెట్ జట్టుకు పరిశీలనలో ఉన్న ఆటగాడు కావడంతో... రంజీ సీజన్ మొత్తం ఆయన అందుబాటులో ఉండటం కష్టమవుతోంది. ఆయనకు బదులు మరొకర్ని కెప్టెన్గా నియమించాలని సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ నుంచి మాకు ఈమెయిల్ వచ్చింది. అందుకే ఆయనను కెప్టెన్గా తొలగించాం అని ఏసీఏ పేర్కొంది.

Search
Categories
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: