Responsive Header with Date and Time

సముద్ర గర్భం లోని కృష్ణుడికి ప్రధాని మోదీ పూజలు...

Category : | Sub Category : బ్రేకింగ్ న్యూస్ Posted on 2024-02-26 15:19:26


సముద్ర గర్భం లోని కృష్ణుడికి ప్రధాని మోదీ పూజలు...

TWM News : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్ తీరంలో అరే బియా సముద్రంలో మరో సాహసకృత్యం చేశారు. నౌకాదళ డైవర్ల సాయంతో స్కూబా డైవింగ్ చేసుకుంటూ సముద్ర గర్భానికి చేరుకున్నారు. బెట్ ద్వారక ద్వీపం వద్ద నీళ్లలో ఉన్న ప్రాచీన ద్వారక నగరాన్ని చూసి తాదాత్మ్యం చెందారు. పద్మాసనం వేసి, తన వెంట తెచ్చుకున్న నెమలి పింఛాలను శ్రీకృష్ణునికి కానుకగా సమర్పించారు. అక్కడే పూజలు చేసి, సముద్ర ఉపరితలం మీదకు వచ్చారు. చారిత్రక ఆధారాలున్న ద్వారక నగరాన్ని చేరుకుని దైవాన్ని ప్రార్ధించడం దివ్యమైన అనుభూతిని ఇచ్చిందని, ఈ ప్రయాణాన్ని సాహసయాత్రగా కంటే విశ్వాసంతో చేసినదిగా బావించాలని ఆయన పేర్కొన్నారు. ఇటీవల లక్షద్వీప్ పర్యటనలో సాహసంతో స్విమ్మింగ్, స్నార్కెలింగ్ చేసిన ప్రధాని తన తాజా యాత్ర చిత్రాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

దశాబ్దాల కల నెరవేరిన క్షణాలివి...

ఆధ్యాత్మిక వైభవం, అనంతమైన భక్తితో కూడిన పురా తన యుగానికి కాసేపు అనుసంధానమయ్యాను. శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఆశీర్వదిస్తాడు. సముద్రగర్భ ద్వారకను చేరుకోవాలనేది నాకు దశాబ్దాల కల. ఎట్టకే లకు అది నెరవేరినప్పుడు, పవిత్ర భూమిని చేతులతో తాకినప్పుడు నా మది అంతా భావోద్వేగంతో నిండిపో యింది. అక్కడకు వెళ్లగానే దేశ వైభవమంతా కళ్ల ముందు కదలాడింది. వేదాల్లోనూ ఈ నగరం గురించి ఉంది. ఒక గొప్ప నగరానికి ప్రణాళిక, అభివృద్ధి ఎలా ఉండాలో చెప్పడానికి ఇది పెద్ద ఉదాహరణ. ఈ నిర్మాణ దార్శనికత చూశాక దేశాభివృద్ధికి నా సంకల్పం మరింత బలపడింది. శ్రీకృష్ణుడి కోరికపై విశ్వకర్మ ఈ నగరాన్ని నిరించారని చెబుతారు అని మోదీ వివరించారు.

అందుబాటులోకి సుదర్శన్ సేతు...

దేశంలో అతి పొడవైన తీగల వంతెన "సుదర్శన్ సేతు" ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. గుజరాత్లోని దేవభూమి ద్వారక జిల్లాలోని ఓఖా ప్రధాన భూభాగాన్ని. బెట్ ద్వారక ద్వీపాన్ని కలిపే ఈ వంతెనను ప్రధాని ప్రారంభించారు. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. రూ. 979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. 27.20 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలతో నిర్మించిన ఈ వంతెనపై 2.50 మీటర్ల వెడల్పైన నడకమార్గం కూడా ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ఇంతవరకు నాటుపడవలే ఆధా రంగా ఉండేవి. కొత్త వంతెనపై పలుచోట్ల సౌరఫలకాలు ఏర్పాటుచేసి ఒక మెగావాట్ విద్యుదుత్పత్తి చేయనున్నారు. మొత్తం రూ.4,100 కోట్ల పనులకు మోదీ శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పూర్తి బలాన్ని ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్లడానికే వినియోగించిం దని విమర్శించారు. అన్నిరకాల కుంభకోణాలూ ఆ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని చెప్పారు. వాటన్నిటికీ తమ సర్కారు అడ్డుకట్ట వేసిందన్నారు. గత పదేళ్లలో సాధించిన అభివృద్ధిని వివరించారు. రాజ్కోట్లో నిర్మిం చిన ఎయిమ్స్ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. మరో నాలుగు రాష్ట్రాల్లో వాటిని వర్చువల్గా ప్రారంభించారు. ఇతరుల నుంచి ఆశలు అంతరించినప్పుడు మోదీ హామీ మొదలవుతుందని చెప్పారు. 50 ఏళ్లపాటు దేశానికి ఒకే ఎయిమ్స్ సంస్థ దిల్లీలో ఉంటే పది రోజుల్లోనే తాను ఏడు ఎయిమ్స్కు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశానని, వీటిలో రాయ్బరేలీ కూడా ఉందని వివరించారు. ఆరేడు దశాబ్దాల్లో లేని అభివృద్ధిని సాధించి చూపించి, ప్రజల పాదాలకు అంకితం చేస్తున్నానన్నారు.


Search
Categories
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: