Responsive Header with Date and Time

సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వాలంటూ పెట్రోల్ పోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం...

Category : | Sub Category : రాజకీయం Posted on 2024-02-26 12:15:46


సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వాలంటూ పెట్రోల్ పోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం...

TWM News : కర్నూలు అసెంబ్లీ వైసీపీ టికెట్ పై ఆ పార్టీలో ముసలం మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే మరోసారి అవకాశం ఇవ్వాలంటూ హాఫీస్ ఖాన్ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. భవిష్యత్ కార్యాచరణపై ప్రత్యేకంగా సమావేశమైన కార్యకర్తలకు సర్ధి చెప్పేందుకు పార్టీ దూతలు హాజరయ్యారు. వారి ముందు సెట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు

కర్నూలు అసెంబ్లీ వైసీసీ టికెట్ స్థానిక ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్ కే ఇవ్వాలని ఎమ్మెల్యే అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు నగరంలోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో కార్యకర్తల సమావేశంలో కర్నూలు జిల్లా వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ రా మసుబ్బారెడ్డి ముందు వైసీసీ కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరులు నిరసన తెలిపారు. అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్ ఇంట్లో నిర్వహించారు. ఈ సమావేశం కొనసాగుతున్న సమయంలో ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

కార్యకర్తలతో పార్టీ సమన్వయకర్తలు మాట్లాడుతుండగానే, కర్నూలు టికెట్ ను హాఫీస్ ఖాన్ కు ఇవ్వాలని లేకుంటే తమ శవాలపై వైసీపీ జెండాను ఎగరవేయాలని అంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించాడు ఓ కార్యకర్త. వెంటనే అప్రమత్తమైన వైసీసీ కార్యకర్తలు పెట్రోల్ పోసుకున్న వ్యక్తిని అడ్డుకుని నీళ్లు పోశారు. హఠాత్ పరిణామంతో అంతా ఒక్కసారి షాక్ అయ్యారు. అయితే సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. ఈ సమావేశంలో పాల్గొన్న వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి ఈ పరిణామాలన్నింటికి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో కార్యకర్తలు సర్ధుమణిగారు.


Search
Categories
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: