Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2024-11-20 10:47:41
TWM News:-ఢిల్లీలో వాట్ ఇండియా థింక్స్ థీమ్‌తో గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించిన TV9 గ్రూప్‌కు చెందిన న్యూస్ 9 .. ఇప్పుడు జర్మనీ లోని స్టుట్‌గాట్ నగరం వేదికగా మరో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తోంది. నవంబర్ 21 నుంచి 23వ తేదీ వరకు జరిగే సదస్సులో ప్రధాని మోదీ కూడా ప్రసంగిస్తారు. ఇలాంటి సదస్సును ఓ మీడియా సంస్థ నిర్వహించడం చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది..
భారత్- జర్మనీ దేశాల మధ్య వాణిజ్య , ద్వైపాక్షిక, సాంస్కృతిక , క్రీడా సంబంధాలను బలోపేతంగా చేయడం లక్ష్యంగా TV9 గ్రూప్‌నకు చెందిన న్యూస్ 9 ఆధ్వర్యంలో జర్మనీలోని స్టుట్‌గాట్ నగరంలో ఇండియా-జర్మనీ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది.. ఈనెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు MHP ఎరినాలో ఈ శిఖరాగ్ర సదస్సు జరగనుంది.. TV9 నెట్‌వర్క్ ఎండీ, సీఈఓ బరుణ్ దాస్ అధ్యక్షతన జరిగే మూడు రోజుల న్యూస్9 భారత్-జర్మనీ గ్లోబల్ సమ్మిట్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. రెండవరోజు.. ‘‘ఇండియా: ఇన్‌సైడ్ ది గ్లోబల్ బ్రైట్ స్పాట్’’ అంశంపై అంతర్జాతీయ భాగస్వామ్యాల బలోపేతం, ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్ ప్రభావం.. పాత్ర.. దూర దృష్టి తదితర విషయాలను ప్రధాని మోదీ పంచుకోనున్నారు. గురువారం సదస్సు ప్రారంభం కానుంది.. మూడు రోజులపాటు న్యూస్9 ఆధ్వర్యంలో ఇండియా-జర్మనీ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది..
టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో..
గత ఫిభ్రవరిలో న్యూస్ -9 ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఇండియా-జర్మనీ సమ్మిట్‌కు కొనసాగింపుగా జర్మనీలో కూడా సదస్సును నిర్వహిస్తున్నారు. స్టుట్‌గార్డ్ నగరం బెంజ్ కార్ల తయారీతో పాటు ఫుట్‌బాల్‌కు చాలా ప్రసిద్ది. భారత్‌ను కూడా ఫుట్‌బాల్ రంగంలో తీర్చిదిద్దేందుకు TV9 గ్రూప్ నడుంబిగించిది.. ఈ మేరకు టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే..