Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2024-11-20 09:55:04
TWM News:-రఫెల్ నాదల్తో పోటీ వల్ల తాను ఆటను మరింత ఆస్వాదించానని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ వ్యాఖ్యానించాడు. కెరీర్లో నాదల్ చివరి టోర్నీ డేవిస్ కప్ ఫైనల్స్ ఆరంభానికి కొన్ని గంటల ముందు అతడికి ఓ భావోద్వేగ లేఖ రాశాడు.
మాలగా (స్పెయిన్): రఫెల్ నాదల్తో పోటీ వల్ల తాను ఆటను మరింత ఆస్వాదించానని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ వ్యాఖ్యానించాడు. కెరీర్లో నాదల్ చివరి టోర్నీ డేవిస్ కప్ ఫైనల్స్ ఆరంభానికి కొన్ని గంటల ముందు అతడికి ఓ భావోద్వేగ లేఖ రాశాడు. ముందు ఓ తెలిసిన విషయంతో మొదలెడతా. నువ్వు నన్ను ఎన్నో సార్లు ఓడించావు.. నేను నిన్ను ఓడించినదానికన్నా ఎక్కువగా! నీ అంతగా నాకెవరూ సవాలు విసరలేదు. మట్టిలో ఆడుతున్నప్పుడు నీ అడ్డాలో ఆడుతున్నట్లుండేది. నేనెప్పుడూ ఊహించనిదాని కన్నా ఎక్కువగా కష్టపడేలా చేశావు. ఏమన్నా ప్రయోజముంటుందేమోనన్న ఆశతో నా రాకెట్ హెడ్ పరిమాణాన్ని మార్చేలా చేశావు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేఖలో ఫెదరర్ పేర్కొన్నాడు. ఆటలో ప్రత్యర్థులే అయినా.. నాదల్, ఫెదరర్లు ఇద్దరూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.
టెన్నిస్ ప్రపంచం గర్వపడేలా.. ముఖాముఖిలో ఫెదరర్పై నాదల్ 26-14తో ఆధిక్యం కలిగి ఉన్నాడు. గ్రాండ్లమ్స్ ఈ రికార్డు 10-4. అయినా నాదల్తో తలపడడం వల్ల తాను ఆటను మరింతగా ఆస్వాదించానని ఫెదరర్ పేర్కొన్నాడు. రఫా.. నేను ఆటను మరింతగా ఆస్వాదించేలా చేశావు. నీది చాలా గొప్ప ప్రయాణం. నువ్వు 14 ఫ్రెంచ్ ఓపెన్లు గెలవడం చరిత్రాత్మకం. స్పెయిన్ గర్వపడేలా చేశావు. మొత్తం టెన్నిస్ ప్రపంచం గర్వపడేలా చేశావు అని అన్నాడు. 2022 సెప్టెంబరులో లేవర్కప్లో డబుల్స్ మ్యాచ్లో ఫెదరర్ ఆటకు గుడ్బై చెప్పినప్పుడు అతడి భాగస్వామి నాదలే . ఆ మ్యాచ్ తర్వాత ఆటగాళ్లిద్దరూ పక్కపక్కనే కూర్చుని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు నువ్వు నా భాగస్వామిగా నా పక్కనుండడం గొప్పగా అనిపించింది. ఆ రోజు నీతో కోర్టును, కన్నీళ్లనూ పంచుకోవడం నా కెరీర్లో మరిచిపోలేని సందర్భాల్లో ఒకటి అని ఫెదరర్ రాసుకొచ్చాడు. రఫా.. నీ అద్భుత కెరీర్లో ఆఖరి పోరుపై దృష్టిపెట్టావని తెలుసు. అది ముగిశాక మాట్లాడుకుందాం. నీ పాత స్నేహితుడు ఎల్లప్పుడూ నీ విజయాన్ని కాంక్షిస్తూ ఉంటాడని నువ్వు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నా అని అన్నాడు.