Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2024-11-18 11:37:23
TWM News:-ఫ్రైడ్ రైస్‌లు అంటే భారతీయులు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. సులువుగా అయ్యే వాటిల్లో ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. ఇంట్లో చేసిన వాటి కంటే బయట తినేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ చైనీస్ స్టైల్‌లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్‌లో ఫేమస్ అయినా సింగపూర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం...
చైనీస్ ఫుడ్స్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. భారత దేశంలో కూడా చైనీస్ రెస్టారెంట్లు చాలానే ఉన్నాయి. ఫుడ్ ఎలా ఉంటుందోనని టేస్టే చేస్తూ ఉంటారు. మన దేశంలో కంటే ఇతర దేశాల్లో ఫ్రైడ్ రైస్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఎక్కువగా సింగపూర్ ఫ్రైడ్ రైస్ చాలా ఫేమస్. సింగపూర్‌లో ఫ్రైడ్ రైస్ అనేది ఎంతో ప్రసిద్ధి చెందిన వంటకం. అందుకే చైనీస్ ఫుడ్ ఐటెమ్స్‌లో ఖచ్చితంగా సింగపూర్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది. ఈ రెసిపీ రుచిగా కాస్త భిన్నంగా ఉంటుంది. మరి ఈ సింగపూర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేస్తారు? తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సింగపూర్ ఫ్రైస్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు:
బాస్మతి రైస్, కోడి గుడ్లు, చికెన్ లేదా రొయ్యలు, ఫిష్, క్యారెట్, బీన్స్, క్యాబేజీ, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, సోయా సాస్, చిల్లీ ఫ్లేక్స్, వెనిగర్, తేనె, ఆయిల్.
సింగపూర్ ఫ్రైస్ రైస్ తయారీ విధానం:
ముందుగా బాస్మతీ రైస్‌ని నానబెట్టి అన్నాన్ని పొడి పొడిగా ఉడికించి పక్కన పెట్టాలి. చికెన్, రొయ్యలు, ఫిష్‌లను కూడా ముందుగానే ఉడించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పెట్టాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో ముందుగా ఆయిల్ వేసి గుడ్డు వేసి వేగాక తీసిన పక్కన పెట్టాలి. ఆ తర్వాత చికెన్, రొయ్యలు, ఫిష్ ఇలా మీకు ఇష్టమైన వాటిని కూడా వేసి బాగా వేయించాలి.. ఇవి వేగా వెజిటేబుల్స్ ఒక్కొక్కటి వేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవి కూడా బాగా వేగాక ఎగ్ వేస్తారు.
ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఉడికించి పక్కన పెట్టిన బాస్మతీ రైస్ కూడా వేసి అన్నీ ఒకసారి కలుపుతారు. ఇప్పుడు సోయా సాస్, చిల్లీ ఫ్లేక్స్, వెనిగర్, తేనె కొద్దిగా వేసి పెద్ద మంట మీద ఓ పది నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా వేయిస్తూ ఉండాలి. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేస్తారు. అంతే ఎంతో రుచిగా ఉండే సింగపూర్ ఫ్రైడ్ రైస్ సిద్ధం. చైనీస్ ఐటెమ్స్ పెద్ద మంట మీద చేస్తేనే రుచి బాగుంటుంది. రెసిపీకి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది.