Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2024-11-18 11:32:15
TWM News:-మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం కారణంగా చాలా మంది జుట్టు ఊడిపోవడం, వెంట్రుకలు తెల్లబడడం.. వంటి సమస్యలతో బాధడుతున్నారు. ఇలాంటి వారు.. ఉసిరి, కొబ్బరినూనె హెయిర్ మాస్క్ ట్రై చేశారంటే మంచి ఫలితం పొందవచ్చంటున్నారు నిపుణులు. ఈ హెయిర్‌ప్యాక్ తయారీ, ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..
ఉసిరిలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరిలోని పోషకాలు జుట్టుకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. ఉసిరిలో ఉండే కాల్షియం వంటి ఖనిజాలు.. ఎండ వల్ల కలిగే నష్టం నుంచి జుట్టును రక్షిస్తాయి. ముఖ్యంగా ఉసిరిలో పుష్కలంగా ఉండే విటమిన్ C జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా.. కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. ఉసిరిపొడిని జుట్టు సమస్యలకు పరిష్కారంగా వాడిన వారిలో తలపై వాపు తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా, నల్లగా పెరిగిందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.
కొబ్బరి నూనెలో కూడా ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన శరీరంలో జీవక్రియను వేగవంతం చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. కొబ్బరి నూనె తలపై తేమను నిలిపి ఉంచి, జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తలలో చికాకును తగ్గించి, స్కాల్ప్‌కు మంచి రిలీఫ్ కలిగిస్తాయి.
కొబ్బరి నూనె, ఉసిరి పొడితో హెయిర్ మాస్క్‌ను తయారు చేయటానికి ముందుగా ఒక గిన్నెలో కాస్త కొబ్బరినూనె తీసుకొని లైట్‌గా వేడి చేయండి. ఆ తర్వాత అందులో ఉసిరికాయ పొడిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమం చల్లారాక దాన్ని మీ జుట్టు, తల చర్మంపై పూర్తిగా పట్టేలా అప్లై చేయండి. అలా 1 గంట పాటు ఆరిపోయిన తరువాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి.
తరచూ ఇలా చేయడం ద్వారా మీ జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది. ఈ కొబ్బరినూనె, ఉసిరికాయ పొడి మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేయడం వల్ల ఇంకా అనేక ఇతర సమస్యలు కూడా నయం కావడంతో పాటు.. స్కాల్ప్‌లో రక్త ప్రసరణ పెరుగుతుందని, ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.