Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2024-11-18 11:21:34
TWM News:-కొరియన్ల వంటి సౌందర్యం కావాలని అందరూ కోరుకుంటారు..ఎలాంటి మచ్చల్లేకుండా అందమైన గ్లాస్ స్కిన్ కావాలని ఆరాటపడుతుంటారు. ప్రతి మహిళకు కొరియన్లలా మెరిసిపోవాలనుంటుంది. అందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం కొందరు బ్యూటీపార్లర్లను ఆశ్రయిస్తుండగా, మరికొందరు మార్కెట్‌లో లభించే కెమికల్ ఆధారిత ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే, చర్మాన్ని నిగనిగలాడేలా యవ్వనంగా ఉంచేందుకు కొరియన్ మహిళలు చర్మ సంరక్షణతో పాటు డైట్, లైఫ్‌స్టైల్ చాలా జాగ్రత్తగా ఉంచుకుంటారని నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా మెరిసే చర్మం కావాలంటే మీ డైట్‌లో ఈ ప్రత్యేకమైన డ్రింక్ తప్పకుండా చేర్చుకోవాలని చెబుతున్నారు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
అశ్వగంధ.. మొక్క వేరు నుండి లభించే పదార్థం. ఇది వేరు రూపంలో ఉంటుంది. దీన్ని సేకరించి ఎండబెట్టి పొడిగా చేసి వివిధ ఆరోగ్య సమస్యలకు ఔషదంగా వాడతారు. అశ్వగంధ కేవలం పొడి రూపంలోనే కాకుండా టాబ్లెట్లు, లేహ్యం రూపంలో కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.
అశ్వగంధలో ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్ల స్థాయిని తగ్గించడంలో సహాయపడే గుణాలున్నాయి. మధుమేహ రోగులకు ఉత్తేజాన్ని అందిస్తుంది. మొత్తం శరీర కొవ్వు శాతాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అశ్వగంధ టీ తయారు చేసేందుకు 1 కప్పు నీటిలో సగం స్పూన్ అశ్వగంధ పౌడర్ కలపాలి. 5 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి. గోరువెచ్చగా తాగాలి