Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2024-11-18 10:44:51
TWM News:-ఇజ్రాయెల్ చేపట్టిన \'హమాస్ ఆపరేషన్‌లోభారతీయ సంతతి సైనికుడు మరణించాడు. ఈ సైనికుడు భారతదేశంలోని మణిపూర్ నుంచి ఇజ్రాయెల్ వెళ్ళిన సంతతికి చెందినవాడు. మరణించిన సైనికుడి ఇద్దరు సోదరీమణులు.. వీరు కూడా ఇజ్రాయెల్ ఆర్మీలో ఉన్నారు.
గత ఏడాది నుంచి జరుగుతున్న గాజా యుద్ధం వేలాది మంది ప్రాణాలను తీసింది. ఈ యుద్ధంలో మరణించిన వారిలో పాలస్తీనియన్లు, ఇజ్రాయిలీలు మాత్రమే కాదు విదేశీ పౌరులు కూడా ఉన్నారు. హమాస్ హటాత్తుగా ఇజ్రాయెల్ పై దాడి చేసి వందల మందిని చంపింది.. కొన్ని వందల మందిని బందీలుగా తీసుకుని వెళ్ళింది. తమపై హమాస్ చేసిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం హామాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ గాజాలోకి చొరబడి ఒక సంవత్సరం తర్వాత కూడా.. హమాస్ యోధులు ఇజ్రాయెల్ సైనికులను లక్ష్యంగా చేసుకుంటూనే ఉన్నారు. హమాస్ జరిపిన ఇలాంటి ఆపరేషన్‌లో భారత సంతతికి చెందిన సైనికుడు మరణించాడు.
నవంబర్ 12న హమాస్ యోధులు జోలాట్ మిలిటరీ యూనిట్‌పై ఇంట్లో తయారు చేసిన యాంటీ ట్యాంక్ షెల్‌తో దాడి చేశారు. స్టాఫ్ సార్జెంట్ గ్యారీ జోలాట్‌తో పాటు మరో ముగ్గురు IDF సైనికులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో సైనికులు మరణించిన తర్వాత ఈ ఘటనపై ఆర్మీ దర్యాప్తు ప్రారంభించింది. నివేదికల ప్రకారం భారత సంతతికి చెందిన 21 ఏళ్ల జోలాట్ గా గుర్తించారు. జోలాట్ గాజా యుద్ధంలో IDF.. Kfir బ్రిగేడ్ 92వ బెటాలియన్‌లో విధులను నిర్వహిస్తున్నాడు. ఇజ్రాయెల్ లో నిబంధనల మేరకు ఆర్మీలో విధులను నిర్వహిస్తున్నాడు. త్వరలో ఈ తప్పనిసరి ఆర్మీ సేవలను త్వరలో పూర్తి కావొస్తుంది. అయితే ఇంతలో ఈ దారుణం జరిగింది. జోలాట్ కి ఇద్దరు సోదరీమణులు.. వీరు కూడా ఇజ్రాయెల్ సైన్యంలో ఉన్నారు.