Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-11-18 10:43:50
దేశంలోని ప్రముఖ రీసెర్చి ఇనిస్టిట్యూట్ అయిన ఐఐటీ మద్రాస్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంతో పాటు వివిధ రంగాల్లో అధునాతన సాంకేతికత, పరిశోధనల ఫలాలను ఏపీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. వివిధ పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అత్యాధునిక పరిశోధనలు నిర్వహించడం, సమాజానికి ఉపయోగపడే కార్యకలాపాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఐఐటీ మద్రాస్ నిర్ణయించింది. ఐఐటీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన చర్చలు ఫలించడంతో.. శుక్రవారం సాయంత్రం ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య శాఖా మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఐఐటీ మద్రాస్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు కీలక ఒప్పందాలపై సంతకాలు చేయడం జరిగింది.