Responsive Header with Date and Time

దీర్ఘాయువు ఇచ్చే ఆహారాలు ఇవే.. క్రమం తప్పకుండా తింటే సంపూర్ణ కాలం జీవించొచ్చు

Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-18 10:39:13


దీర్ఘాయువు ఇచ్చే ఆహారాలు ఇవే.. క్రమం తప్పకుండా తింటే సంపూర్ణ కాలం జీవించొచ్చు

TWM News:-మనలో చాలా మందికి దీర్ఘాయువు కావాలని కోరుకుంటారు. అందుకు రకరకాల యోగాసనాలు వేయడం, రకరకాల ప్రదేశాలకు వెళ్లడం, పూజలు చేయడం వంటివి చేస్తుంటారు. అయితే ఆహారం ద్వారా కూడా మంచి ఆయుష్షును పొందొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు..

దేశం ఒకటే అయినప్పటికీ మన ఆహార అలవాట్లు వేరు. ఆహారాల్లో కూరగాయల కంటే మాంసం చాలా రుచిగా ఉంటుంది. కానీ ఇది త్వరగా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అందుకే శాకాహారుల కంటే మాంసాహారుల జీవితకాలం తక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక అధ్యయనంలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కన్సల్టెంట్ వాల్టర్ విల్లెట్ చెప్పిందేమిటంటే.. మాంసం తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అంతే కాకుండా శాకాహారులు మాంసాహారుల కంటే ఎనిమిదేళ్లు ఎక్కువ కాలం జీవిస్తారట. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే ఈ కింది కూరగాయలను తినాలని సూచించారు. అవి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ఈ క్రింది కూరగాయలను ఆహారంలో చేర్చుకుంటే ఎక్కువ కాలం జీవించవచ్చని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇవి బెస్ట్ ఫుడ్స్‌ లిస్టులో ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వీటిలో మొదటిది పాలకూర. తరువాత క్యాబేజీ, టర్నిప్ ఆకుతు, దుంపలు, ఇతర ఆకుపచ్చ కూరగాయలు. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యల నుంచి మనలను కాపాడతాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అంతేకాకుండా క్యాన్సర్ నుండి రక్షించే యాంటీఆక్సిడెంట్లు వీటిల్లో పుష్కలంగా ఉంటాయి.

ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటంటే

పాలకూరలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె1, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడి నుంచి మనలను రక్షిస్తుంది. కణాలను దెబ్బతినకుండా కూడా కాపాడుతుంది.

టర్నిప్ ఆకులలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ ఉన్నాయి. ఇవి చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తహీనత, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

దుంపలు తినడం వల్ల రక్తనాళాల్లో రక్త ప్రసరణ మెరుగవుతుంది. వీటిలో నైట్రేట్లు ఉంటాయి. ఇవి రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. ఇది మీ స్టామినాను మెరుగుపరుస్తుంది. ఇవి మంచి జీర్ణక్రియకు ఉపయోగపడతాయి.

నోట్‌: ఇక్కడ ఉన్న విషయాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.


Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: