Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-11-18 10:26:04
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయి. అనకాపల్లి సమీపంలోని పూడిమడకలో ఎన్టీపీపీ తలపెట్టిన గ్రీన్ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరుగుతుందని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఇతర అధికారులు ఏయూ మైదానాన్ని పరిశీలించారు. ఇదే పర్యటనలో విశాఖ రైల్వేజోన్‌తో పాటు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిసింది. అయితే ఇప్పటివరకు పీఎం పర్యటనకు సంబంధించి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.