Responsive Header with Date and Time

నాడు రూ. 20 లక్షలు.. నేడు రూ. 5.5 కోట్లు.. కట్‌చేస్తే.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా అన్‌క్యాప్డ్ ప్లేయర్.

Category : క్రీడలు | Sub Category : జాతీయ Posted on 2024-11-18 09:48:58


నాడు రూ. 20 లక్షలు.. నేడు రూ. 5.5 కోట్లు.. కట్‌చేస్తే.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా అన్‌క్యాప్డ్ ప్లేయర్.

TWM News:- నాకు కెప్టెన్‌గా ఉండే అవకాశం ఉంది. జట్టు ఛాంపియన్‌షిప్ గెలవడానికి నేను సహాయం చేయగలను. పంజాబ్ జట్టు నాకు కెప్టెన్‌గా అవకాశం ఇస్తే.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను అంటూ పంజాబ్ రిటైన్ ప్లేయర్ చెప్పుకొచ్చాడు. డివై పాటిల్ టీ20 టోర్నీకి ఐదేళ్ల పాటు కెప్టెన్‌గా వ్యవహరించానని, శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్ వంటి ఆటగాళ్లు కూడా నా నాయకత్వంలో ఆడారంటూ తన వాదనను వినిపించాడు.

ఈసారి ఐపీఎల్ మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ జట్టులో కేవలం ఇద్దరు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే, జట్టులో స్టార్ ప్లేయర్‌లు ఉన్నప్పటికీ, వారందరినీ తొలగించి, ఇద్దరు అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌లను ఉంచాలని ఫ్రాంచైజీ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

పంజాబ్ రిటైన్ చేసుకున్న ఇద్దరు ఆటగాళ్లలో శశాంక్ సింగ్ ఒకరు. ఐపీఎల్ 2024లో పంజాబ్ అతడిని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే తను తీసుకున్న జీతం కంటే శశాంక్ అద్భుతమైన ఆటతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. పంజాబ్ తరపున అతను ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ కారణంగానే ఈసారి 5.5 కోట్లకు పంజాబ్ అతడిని అట్టిపెట్టుకుంది.

పంజాబ్ జట్టులో కొనసాగిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శశాంక్.. తాను ధోనీకి వీరాభిమానిని అని పేర్కొన్నాడు. ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరసేన ఆడాలనే కోరికను శశాంక్ వ్యక్తం చేశాడు. అలాగే, ఈ ఇంటర్వ్యూలో పంజాబ్ జట్టుకు కెప్టెన్ అవ్వాలనే కోరికను వ్యక్తం చేశాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు నాయకుడిగా ఉండే సత్తా ఉంది. ఛాంపియన్‌షిప్‌లో జట్టు గెలవడానికి నేను సహాయం చేయగలను. పంజాబ్ జట్టు నాకు కెప్టెన్‌గా అవకాశం ఇస్తే.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. డివై పాటిల్ టీ20 టోర్నీకి ఐదేళ్ల పాటు కెప్టెన్‌గా వ్యవహరించాను. శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్ వంటి ఆటగాళ్లు కూడా నా నాయకత్వంలో ఆడారు.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: