Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-11-15 10:35:07
అధికారం కోల్పోయినప్పుడల్లా బీఆర్‌ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో భట్టి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వైఫల్యం ఏంటో కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే ప్రభుత్వ వైఫల్యమా? రైతు రుణమాఫీ చేయడం వైఫల్యమా? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం ప్రభుత్వ వైఫల్యమా? ఫార్మా క్టస్లర్స్ విస్తరణను వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని. కక్ష పూరిత రాజకీయాలకు మేం వ్యతిరేకం. ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ తన పాత్ర పోషించిందా? ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడంపైనే ఆ పార్టీ దృష్టి పెట్టింది. కులగణన చేస్తామని మాటా ఇచ్చాం. దాని ప్రకారం చేసి చూపిస్తున్నాం. ఇది విప్లవాత్మక నిర్ణయం. రాష్ట్రాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కాబోతుంది. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే ప్రశ్నలు తయారు చేశాం అని అన్నారు.