Responsive Header with Date and Time

‘మాకు మెట్రో రైలు కావాలి’.. నినాదాలతో హోరెత్తిన జనం..

Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-02-05 11:01:10


‘మాకు మెట్రో రైలు కావాలి’.. నినాదాలతో హోరెత్తిన జనం..

TWM News :- అందరిని నిరాశపరుస్తూ మొండిచేయి చూపించారని మెట్రో సాధన సమితి మండిపడింది. తమకు ఈసారి కూడా తీరని అన్యాయం జరిగిందంటూ గోడును వెళ్లబోసుకుంటున్నారు ఉత్తర ప్రాంత ప్రజలు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రతిపాదిత రెండవ దశ మెట్రో లైనులో మేడ్చల్, కొంపల్లి, బోయిన్పల్లి, అల్వాల్, బొల్లారం, తూముకుంట ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు..


ప్రకటన :


మెట్రో రైల్ కావాలంటూ నగరశివారు ప్రజలు కోరుతున్నారు. మేడ్చల్ మెట్రో పనులు వెంటనే ప్రారంభించాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి డిమాండు చేస్తోంది. ప్రయాణీకుల రద్దీ, ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో మెట్రో మార్గాన్ని ఎంచుకోవాలని కోరారు. రెండవ దశ విస్తరణలో గత ప్రభుత్వం ఉత్తర ప్రాంతానికి ప్రాతినిధ్యం కల్పించలేదు. ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వ ప్రణాళికను రద్దు చేసి, కొత్త ప్రణాళికను తయారు చేస్తోందని ప్రకటన రాగానే.. కొంపల్లి, బోయినపల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, అల్వాల్, షామీర్పేట్, బొల్లారం ప్రాంత ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు.

కానీ అందరిని నిరాశపరుస్తూ మొండిచేయి చూపించారని మెట్రో సాధన సమితి మండిపడింది. తమకు ఈసారి కూడా తీరని అన్యాయం జరిగిందంటూ గోడును వెళ్లబోసుకుంటున్నారు ఉత్తర ప్రాంత ప్రజలు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రతిపాదిత రెండవ దశ మెట్రో లైనులో మేడ్చల్, కొంపల్లి, బోయిన్పల్లి, అల్వాల్, బొల్లారం, తూముకుంట ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మెట్రో సాధన సమితి ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.



https://www.youtube.com/@teluguwebmedia99

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: