Responsive Header with Date and Time

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ప్రాణాలకు ముప్పు ఉందా..?

Category : | Sub Category : బ్రేకింగ్ వార్తలు Posted on 2024-02-05 10:53:13


ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ప్రాణాలకు ముప్పు ఉందా..?

TWM News : ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృ సంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందంటూ మెటా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల విడుదల చేసిన తన వార్షిక నివేదికలో ఈమేరకు ఆందోళన వెలిబుచ్చింది. దీనిలో మార్క్ జుకర్‌బర్గ్ ప్రమాదకరమైన జీవనశైలిని అనుసరిస్తారని, ఇది అతనికి ప్రాణాంతకంగా మారిందని పేర్కొన్నారు.

మెటా సంస్థ వారి వార్షిక నివేదిక...


మెటా సంస్థ ప్రతి సంవత్సరం తన వార్షిక నివేదికను అందజేస్తుంది. ఈసారి కంపెనీ తన వార్షిక నివేదికలో అలాంటిదే చెప్పడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సహా మరికొందరు మేనేజ్‌మెంట్ అధికారులు తమ జీవనశైలిలో విపరీతమైన క్రీడలు, కాంపాక్ట్ స్పోర్ట్స్, రిక్రియేషనల్ ఏవియేషన్ వంటి చాలా రిస్క్-టేకింగ్ కార్యకలాపాలు చేస్తార, పోరాట క్రీడల్లో పాల్గొంటున్నారని మెటా తన రిపోర్టులో పేర్కొంది. ఈ కార్యకలాపాలలో తీవ్రమైన గాయాలు, మరణాలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా దిగ్గజం దాని వ్యవస్థాపకుడు పోటీ పోరాటాలను ఇష్టపడతారని, దాని కారణంగా అతను గత సంవత్సరం గాయంతో బాధపడుతున్నాడు.



మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో గాయపడ్డ జుకర్ బర్గ్‌...


మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో జుకర్ బర్గ్‌కు మంచి ప్రావీణ్యం ఉంది. ఈ క్రమంలోనే గతేడాది బ్రెజిలియన్ మార్షల్ ఆర్ట్స్ ‘జు జిట్సు’ లో ఆయన పాల్గొని బ్లూ బెల్ట్ సాధించారు. ఈ సందర్భంగా ప్రమాదం సంభవించిన జుకర్ బర్గ్ గాయపడ్డారు. జుకర్ బర్గ్ మోకాలికి గాయమైంది. దీంతో ఆయన కంగా శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. మరోవైపు, తనతో కేజ్ ఫైట్ కు రమ్మంటూ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ విసిరిన ఛాలెంజ్ ను జుకర్ బర్గ్ స్వీకరించిన విషయం తెలిసిందే. దీనికోసం ఆయన ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది వీరిద్దరి ఫైట్ కోసం ఎదురుచూశారు. అయితే, మస్క్ ఈ ఛాలెంజ్ ను తేలిగ్గా తీసుకున్నాడని ఆరోపిస్తూ జుకర్ బర్గ్ ఈ ఫైటింగ్ ఆలోచనను వదిలేశారు. ఈ క్రమంలోనే ఆయన ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయినా కంపెనీ నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతుందని వెల్లడించింది.



శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న జుకర్ బర్గ్...


అయితే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వివరణ ఇచ్చారు జుకర్ బర్గ్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోను షేర్ చేశారు. ఆసుపత్రి బెడ్‌పై ఎడమ కాలుకు బ్యాండేజ్‌తో సపోర్టివ్ లెగ్ బ్రేస్‌తో కనిపించారు. ”నా ACL స్పారింగ్‌ను చింపి, దానిని భర్తీ చేయడానికి శస్త్రచికిత్స నుండి బయటపడ్డాను. నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్న వైద్యులు, వారి బృందానికి కృతజ్ఞతలు. నేను వచ్చే ఏడాది ప్రారంభంలో పోటీ MMA ఫైట్ కోసం శిక్షణ పొందుతున్నాను, కానీ ఇప్పుడు అది కాస్త ఆలస్యమైంది. నేను త్వరగా కోలుకోవాలని ఎదురుచూస్తున్నాను. ప్రేమ, మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అంటూ కామెంట్ చేశారు జుకర్ బర్గ్.



కంపెనీ షేర్లలో భారీ పెరుగుదల...


అయితే, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ వల్ల చనిపోతున్న వారి సంఖ్య చాలా తక్కువ. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ కారణంగా ఇప్పటివరకు 20 మంది మాత్రమే మరణించారు. మెటా తన నివేదిక తర్వాత, కంపెనీ షేర్లు గణనీయంగా పెరిగాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 2 శుక్రవారం కంపెనీ విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల అనంతరం మెటా షేర్లు 20 శాతం పెరిగి జుకర్ బర్గ్ సంపద 170.5 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది ఒక రోజులో ఏ కంపెనీకి దక్కని అత్యధిక మొత్తం కావడం విశేషం. ఇక ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో బిల్ గేట్స్‌ను అధిగమించిన జుకర్ బర్గ్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ గేట్స్‌ 165 బిలియన్‌ డాలర్ల సంపదతో ఐదో స్థానంలో ఉన్నారు.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: