Responsive Header with Date and Time

Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-10-01 12:45:21


ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుమల డిక్లరేషన్‌పై రాద్దాంతం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో శ్రీ విద్యారణ్య నూతన భవన ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ దళితులకు తిరుమలలో అన్యాయం జరుగుతోందని చెప్పడం సిగ్గు చేటన్నారు. దళితులే అసలైన హిందూ ధర్మ రక్షకులని చెప్పారు. దళితులపై లేనిపోని ప్రేమ ఒలకబోస్తూ క్రిస్టియన్లుగా మార్చే కుట్ర జరుగుతోందన్నారు. జగన్ పాలనలో ఎంత మంది దళితులకు తిరుమలలో అన్యాయం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

అన్యమతస్తులు తిరుమల వస్తే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనలు కొత్తగా పెట్టిన నిబంధన కాదని, అలాంటి తిరుమలకు క్రిస్టయన్ అయిన జగన్ వెళుతున్నప్పడు డిక్లరేషన్ ఇస్తే వచ్చే ఇబ్బంది ఏమిటి? ప్రశ్నించారు. గతంలో పూరి ఆలయానికి వెళితే ఇందిరాగాంధీ పార్శి మతస్తుడిని పెళ్లి చేసుకుందని రానివ్వలేదని గుర్తుచేశారు. నేపాల్ పశుపతినాథ్ ఆలయానికి వెళ్ళిన సోనియాగాంధీ క్రిస్టియన్ కాబట్టి రానివ్వలేదని, అంత మాత్రాన దాడి జరిగినట్లా?’’అని ప్రశ్నించారు. బొట్టు పెట్టుకొని టోపీ పెట్టుకోకుండా మక్కా మసీదుకు హిందువులు వెళితే వాళ్లు అనుమతిస్తారా? అని ప్రశ్నించారు. ప్రార్ధనలు చేయకుండా వాటికన్ సిటీ, జెరూసలెంకు హిందువులు వెళతానంటే ఒప్పుకుంటారా? అని పేర్కొన్నారు. తిరుమల విషయంలోనే ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ తీరును చూస్తుంటే టీటీడీ లడ్డూ ప్రసాదంలోనూ కల్తీ చేసినట్లు అనిపిస్తుందన్నారు. ఇది ముమ్మాటికీ హిందుత్వంపై జరుగుతున్న దాడిలో భాగమేనన్నారు. దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందువుపై ఉందిన్నారు. తను కరీంనగర్ శిశు మందిర్ పాఠశాల విద్యార్ధిని అని, ఘోష్ ప్రముఖ్‌గా ఇక్కడికి వచ్చి బహుమతి గెలుచుకున్న రోజులు తనకు గుర్తుకు వస్తున్నట్లు చెప్పారు. దేశం, ధర్మాన్ని బోధించే స్కూల్‌ను అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ర్యాంకుల కోసం పనిచేసే పాఠశాల విద్యారణ్య మందిరం కాదని, విజ్ఝానంతోపాటు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సంస్థ శిశు మందిర్ అని పేర్కొన్నారు. మమ్మీ, డాడీ కల్చర్‌కు వ్యతిరేకమని, మమ్మీ అంటే దెయ్యం, డాడీ అంటే గాడిద అని తెలిపారు.

తల్లిదండ్రులను గౌరవించాలనుకుంటే అమ్మానాన్న అని పిలవాలన్నారు. డబ్బు సంపాదనలో పడి తల్లిదండ్రులను కూడా మర్చిపోతున్నారని చెప్పారు. తల్లిదండ్రులను కూడా. తల్లిదండ్రులపట్ల గౌరవ భావాన్ని పెంచుతున్న ఏకైక విద్యా సంస్థ శిశు మందిర్ మాత్రమేనని పేర్కొన్నారు. ఉన్నతమైన విద్యా కమిషన్‌లో ఛైర్మన్, సభ్యుల బ్యాక్ గ్రౌండ్‌ను ఒకసారి పరిశీలించాలని, కమ్యూనిస్టు భావజాలం ఉన్న వాళ్లను, ఈ దేశ మూలాలు, సంస్కృతి, సంప్రదాయం గురించి పెద్దగా అవగాహన లేనివారే ఉన్నారని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలను కూడా కల్తీ చేసే దుస్థితి వచ్చిందన్నారు. జగన్ పాలనలో శేషాచలం కొండలల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ ఏడు కొండలను రెండు కొండలకే పరిమితం చేసే కుట్ర జరుగుతుందన్నారు. తిరుమలకు అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలనేది నిబంధన ఉందన్నారు. కానీ జగన్ సీఎంగా ఉంటూ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలను దర్శించుకుని నిబంధనలను ఉల్లంఘించినట్లు చెప్పారు. అసలు నిజమైన హిందూ ధర్మ రక్షకులు దళితులేనని పేర్కొన్నారు. వాళ్లకు అన్యాయం జరిగిందని సాకుతో దళితులను క్రిస్టియన్ మతంలోకి మార్చే కుట్ర జగన్ చేస్తున్నారని విమర్శించారు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: