Responsive Header with Date and Time

Category : వ్యాపారం | Sub Category : జాతీయ Posted on 2024-10-01 12:11:31


TWM News:-బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది. అక్టోబర్‌ 1వ తేదీన తులం బంగారంపై అతి స్వల్పంగా అంటే కేవలం పది రూపాయలు మాత్రమే తగ్గింది. దేశీయంగా ధరలను పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,790, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,230 వద్ద కొనసాగుతోంది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,230 ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,230 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,230 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,230 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,230 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,230 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,230 ఉంది.

ఇక బంగారం ధర తగ్గుముఖం పడితే వెండి కూడా అదే దారిలో పయనిస్తోంది. కిలో వెండిపై స్వల్పంగా అంటే వంద రూపాయలు మాత్రమే తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.94,900 వద్ద ఉంది.

ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో కీలక కదలికలు కనిపిస్తున్నాయి. గత నెల మొత్తం తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య కదలాడిన బంగారం.. ఇక సెప్టెంబర్ నెలలో స్వల్పంగా తగ్గుతూ వచ్చింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా ముందు, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ కూడా రాబోయే కాలంలో బంగారం ధరలు పెరగబోతున్నాయని, అందుకే పెట్టుబడిదారులు ఈ విలువైన మెటల్‌పై విశ్వాసం ఉంచాలని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. 2025 ప్రారంభం నాటికి బంగారం ధరలు ఔన్సుకు $2,700కు చేరుకోవచ్చని గోల్డ్‌మన్ సాచ్స్ అభిప్రాయపడింది. అటువంటి పరిస్థితిలో భారతదేశంలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 81000 అవుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: